SSMB29: ఏంటి మహేష్ రాముడా?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ SSMB 29 రూపొందుతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 10 Sept 2025 5:42 PM ISTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ SSMB 29 రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. జక్కన్న పలు షెడ్యూల్స్ ను కంప్లీట్ చేశారు. ఇప్పుడు కెన్యాలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
అయితే ఆఫ్రికన్ అడవుల సాహస యాత్ర బ్యాక్ డ్రాప్ తో మూవీ రూపొందుతున్నట్లు ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తుండగా.. జక్కన్న మాత్రం తన కెరీర్ లో నెవ్వర్ బిఫోర్ అనేలా ఉంటున్నారు. ఇప్పటివరకు కూడా ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. షూటింగ్ కు సంబంధించి ఎలాంటి లీక్స్ రాకుండా హై సెక్యూరిటీ మధ్య నిర్వహిస్తున్నారు.
అదే సమయంలో మహేష్, జక్కన్న మూవీకి సంబంధించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అవి క్షణాల్లో వైరల్ గా మారుతున్నాయి. ఇప్పుడు సినిమాలో రాముడిగా మహేష్ కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. నిజానికి గత ఏడాది ఈ రూమర్ వినిపించగా.. ఇప్పుడు మళ్లీ స్ప్రెడ్ అవుతోంది.
ముఖ్యంగా ఇటీవల మహేష్ ప్రీ లుక్ ను రాజమౌళి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అందులో రుద్రాక్ష, త్రిశూలం, ఢమరుకం, నంది చిహ్నాలు ఉన్న లాకెట్.. సూపర్ స్టార్ మెడలో ఉంది. దీంతో సినిమాలో డివోషనల్ ఎలిమెంట్స్ ఉంటాయని అంతా ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు రాముడిగా మహేష్ కనిపించనున్నారని చెబుతున్నారు.
ఇంకొందరు.. ఏఐ ద్వారా రాముడిగా మహేష్ లుక్ ను కూడా రూపొందించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో అవి నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే నిజంగా మహేష్ రాముడిగా కనిపిస్తే.. ఆ రోల్ లో నటించిన హీరోల జాబితాలో ఆయన చేరుతారు. ఇప్పటికే ఎన్టీఆర్, బాలకృష్ణ, ప్రభాస్ తదితరులు రాముడి పాత్ర పోషించారు.
ఇప్పుడు నిజంగా.. మహేష్ ను రాముడిగా రాజమౌళి చూపిస్తే ఫ్యాన్స్ కు మంచి ట్రీటే. మరి ఇందులో నిజమెంతో ఉందో వారికే తెలియాలి. అదే సమయంలో ఇప్పుడు అందరి ఫోకస్ నవంబర్ పైనే ఉంది. ఆ నెలలో మహేష్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తామని ఇప్పటికే రాజమౌళి అనౌన్స్ చేశారు. కాబట్టి అప్పుడు మహేష్ రోల్ పై క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. మరేం జరుగుతుందో వేచి చూడాలి.
