Begin typing your search above and press return to search.

మహేష్ 'SSMB 29'.. జక్కన్నకు ఆయన నో చెప్పారా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళితో వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 Jun 2025 6:18 PM
మహేష్ SSMB 29.. జక్కన్నకు ఆయన నో చెప్పారా?
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళితో వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. కానీ ఇప్పటి వరకు రాజమౌళి.. ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వకపోవడం గమనార్హం.

తన సినిమాల షూటింగ్ కు ముందే ప్రెస్ మీట్ పెట్టి అన్ని డిటైల్స్ అనౌన్స్ చేసే జక్కన్న.. మహేష్ మూవీ విషయంలో విరుద్ధంగా ఉంటున్నారు. అది కూడా ఆయన స్ట్రాటజీలో భాగమని అంతా చెబుతున్నారు. అయితే సినిమాలో మహేష్ బాబు నటిస్తున్నారన్న విషయం తప్ప మరో యాక్టర్, యాక్ట్రెస్ కోసం రివీల్ చేయలేదు.

కామెంట్ ద్వారా ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తున్నట్లు క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన విలన్‌గా నటిస్తున్నారని తెలుస్తోంది. అదే సమయంలో మూవీలోని క్యాస్టింగ్ కోసం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. వారు నటిస్తున్నారని, వీరు నో చెప్పారని ప్రచారాలు జరుగుతున్నాయి.

అయితే ఒకప్పటి లవర్ బాయ్, కోలీవుడ్ ప్రముఖ నటుడు మాధవన్.. SSMB 29లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన చియాన్ విక్రమ్ యాక్ట్ చేస్తున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు మాధవన్ ఓకే చెప్పేశారని.. రాజమౌళితో తొలిసారి ఆయన వర్క్ చేయనున్నట్లు టాక్ వస్తోంది.

మరోవైపు, బాలీవుడ్ నటుడు నానా పటేకర్.. SSMB29లో నటించడానికి నో చెప్పారని వార్తలు వస్తున్నాయి. అది నిజమో కాదో తెలియనప్పటికీ.. మహేష్ తండ్రిగా నటించడానికి మేకర్స్ ఆయనను సంప్రదించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. 20 కోట్ల రూపాయల పారితోషికం ఇస్తామన్నప్పటికీ.. తిరస్కరించారని వినికిడి.

దీంతో ఆ విషయం వైరల్ గా మారగా, రాజమౌళి సినిమాలో ఆఫర్ కోసం అంతా వెయిట్ చేస్తారని.. ఈయనేంట్రా బాబు రిజెక్ట్ చేశారని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే అసలు విషయమేమిటో, రిజెక్ట్ చేయడానికి కారణమేంటోనని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా SSMB29 క్యాస్టింగ్ డిటైల్స్ ఇంకా సీక్రెటే. మరి రాజమౌళి ఎప్పుడు రివీల్ చేస్తారో వేచి చూడాలి.