కెన్యా అడవుల్లో సూపర్ స్టార్ మహేష్!
ఎస్ ఎస్ ఎంబీ 29 షూటింగ్ శర వేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్, ఒడిశాలో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.
By: Tupaki Desk | 14 Jun 2025 10:51 AM IST# ఎస్ ఎస్ ఎంబీ 29 షూటింగ్ శర వేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్, ఒడిశాలో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇందులో మహేష్, ప్రియాంక చోప్రా, పృధ్వీరాజ్ సుకుమారన్ పాల్గొన్నారు. అటుపై చిత్రీకరణకు కొంత బ్రేవ్ ఇచ్చి మళ్లీ యధావిధిగా హైదరాబాద్ లోనే పున ప్రారంభించారు. ఇందులో మహేష్ లేని సన్నివేశాలు తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో తదుపరి భారీ షెడ్యూల్ కు రంగం సిద్దమవుతోంది.
స్టోరీ పరంగా కొంత భాగం ఆఫ్రికా అటవీ ప్రాంతంలో చిత్రీకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి కెన్యా అటవీ, పార్క్ ప్రాంతాలను సినిమా ప్రారంభానికి ముందే సందర్భించిన సంగతి తెలి సిందే. తన కథకు అనుకూలమైన వాతావరణం అక్కడ ఉందా? లేదా? అన్నది కొన్ని రోజుల పాటు అక్కడే తిష్ట వేసి స్టడీ చేసారు. అవసరమైన సమాచారాన్ని తన కెమెరా బంధించుకుని వచ్చారు.
అంతా ఒకే అనుకున్న తర్వాత ప్రాజెక్ట్ మొదలైంది. అప్పటి నుంచి రాజమౌళి అండ్ కో కెన్యా ఎప్పుడు వెళ్తారు? అన్న దానిపై సర్వాత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా అందుకు సమయం వచ్చేసింది. జూలైలో కెన్యా ప్లైట్ ఎక్కడానికి సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ కి సంబంధించి కెన్యా ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు లభించినట్లు సమాచారం. దాదాపు నెల రోజుల పాటు కెన్యా ప్రాంతంలోనే షూటింగ్ జరుగుతుందని సమాచారం.
ప్రఖ్యాత అంబోసెలి నేషనల్ పార్క్ లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. మహేష్, ప్రియాంక చోప్రా, పృధ్వీరాజ్ సుకుమారన్ పై అక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ప్రధానంగా యాక్షన్ సన్నివేశాలు అక్కడ హైలైట్ చేసే అవకాశం ఉంది. దీనిలో భాగంగా స్థానిక ఫైటర్లను రాజమౌళి భారీ ఎత్తున రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంది.
