Begin typing your search above and press return to search.

రాజ‌మౌళి కాశీ సెట్ రెండు ర‌కాలుగా!

ఎస్ ఎస్ ఎంబీ 29 కోసం భారీ కాశీ సెట్ సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో అచ్చం గా క‌శీ న‌గ‌రాన్నే దించేస్తున్నారు.

By:  Tupaki Desk   |   22 Jun 2025 8:00 AM IST
రాజ‌మౌళి కాశీ సెట్ రెండు ర‌కాలుగా!
X

ఎస్ ఎస్ ఎంబీ 29 కోసం భారీ కాశీ సెట్ సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో అచ్చం గా క‌శీ న‌గ‌రాన్నే దించేస్తున్నారు. ప్ర‌ఖ్యాత ఆర్ట్ దిగ్గ‌జాలంతా ఈ సెట్ వ‌ర్క్ లో భాగ‌మ‌వుతున్నారు. రాజ‌మౌ ళి విజన్ కు తగ్గ‌ట్టు సెట్ రెడీ అవుతోంది. రాజ‌మౌళి సినిమా సెట్స్ అంటే ఎలా ఉంటాయో చెప్పాల్సిన ప‌నిలేదు. సెట్స్ కోస‌మే వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేస్తుంటారు. అందుకోస బ్యాకెండ్ లో ఆర్ట్ డిపార్ట్ మెంట్ కొన్ని నెల‌లుగా ప‌ని చేస్తుంటుంది.

కాశీ న‌గ‌రం సెట్ కోసం 70-80 కోట్ల మ‌ధ్య‌లో ఖ‌ర్చు చేస్తున్నారు. జులైలో కెన్యా షెడ్యూల్ ఉంటుంది. అది ముగించుకుని తిరిగొచ్చిన త‌ర్వాత కాశీ సెట్ లోనే కొత్త షెడ్యూల్ ప్రారంభ మ‌వుతుంది. ఆ సెట్ లోనే దాదాపు రెండు నెల‌ల పాటు షూటింగ్ ఉంటుంద‌ని స‌మాచారం. అయితే ఇదే సెట్ లో `క‌ల్కి 2` చిత్రీక‌ర‌ణ జ‌రిగేలా ప్లాన్ చేస్తున్నారా? అంటే అవున‌నే లీకులందుతున్నాయి.

`క‌ల్కి 2` షూటింగ్ కూడా కాశీ న‌గ‌రం లో చిత్రీక‌రించాల్సి ఉంది. అందుకోసం నాగ్ అశ్విన్ కూడా సెట్లు సిద్దం చేయిస్తున్నారు. అయితే వాటితో ప‌నిలేకుండా రాజ‌మౌళి డిజైన్ చేసిన కాశీ సెట్ ను కూడా త‌న సినిమాకు వినియోగించుకునేలా ఒప్పందం చేసుకున్న‌ట్లు వినిపిస్తుంది. `క‌ల్కి 2` మొద‌ల‌య్యేంత వ‌ర‌కూ అంతే నాణ్య‌త తో సెట్ ఉండేలా డిజైన్ చేస్తున్నారుట‌. సాధార‌ణంగా సెట్ ల‌కు కాల ప‌రిమితి చాలా త‌క్కువ‌గా ఉంటుంది.

నెల‌ల వ్య‌వ‌ధిలోనే అవి పాడైపోతుంటాయి. కానీ ఈ కాశీ న‌గ‌రం సెట్ మాత్రం మ‌రింత నాణ్య‌తతో నిర్మిస్తు న్నారుట‌. రెండు సినిమా షూటింగ్ ల‌కు క‌లిసొచ్చేలా కొంత టెక్నాల‌జీని కూడా వాడుతున్న‌ట్లు తెలి సింది. కొన్ని ర‌కాల ర‌సాయ‌నాల ద్వారా సెట్ తొంద‌ర‌గా పాడ‌వుకుండా నిర్మాణం చేపడుతున్నారుట‌. మ‌రి అందుకు గాను నాగీ నుంచి ఎంత చెల్లిస్తున్నారు? అన్న‌ది తెలియాలి.