ఎస్ ఎస్ ఎంబీ 29 ఏడు దేశాల్లో!
# ఎస్ ఎస్ ఎంబీ 29 ఇప్పటికే ఓ రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకుంది. అనంతరం యూనిట్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చింది.
By: Tupaki Desk | 7 Jun 2025 7:38 PM IST# ఎస్ ఎస్ ఎంబీ 29 ఇప్పటికే ఓ రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకుంది. అనంతరం యూనిట్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చింది. దాదాపు 40 రోజులుగా ఎలాంటి షూటింగ్ జరగలేదు. ఈ ఖాళీ సమయంలో మహేష్ ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. రాజమౌళి కూడా లండన్ విదేశాలంటూ కొన్నాళ్ల పాటు అక్కడే గడిపారు. తాజాగా కొత్త షెడ్యూల్ కి రంగం సిద్దమవుతోంది. జూన్ 9 నుంచి ఓ భారీ షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలవుతుందని సమాచారం.
అల్యుమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్లు సిద్దం చేస్తున్నారుట. అలాగే కాశీ నగరానికి సంబంధించిన ఓప్రత్యేక సెట్ భారీ ఖర్చుతో నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు సెట్స్ లో మహేష్ , పృధ్వీరాజ్ సుకుమారన్ సహా ప్రధాన తారాగణంపై కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిం చనున్నారని సమాచారం. కాశీ సెట్ లో మాత్రం మహేష్ పై కొన్ని సన్నివేశాల చిత్రీకరణ అనంతరం ఇతర నటీనటులు భాగమ య్యేలా ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఇప్పుడీ కాశీ నగరం సెట్ అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకు కాశీ నగరం సెట్ కు సంబంధం ఏంటి? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇది పూర్తిగా అడ్వెంచర్ థ్రిల్లర్. పైగా ఆఫ్రియన్ అడవుల నేపథ్యంతో ముడిపడిన సినిమా గా తీస్తున్నారు. హైదరాబాద్ లో వేసిన సెట్స్ ...ఒడిషా రియల్ లోకేషన్ లో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ సన్నివేశాలు చిత్రీకరించారు. దీంతో ఇప్పటివరకూ సీన్స్ అన్నింటికి అడవి ప్రాధాన్యత హైలైట్ అయింది.
ఈ నేపథ్యంలో కాశీ పేరు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. ఈ షెడ్యూల్ అనంతరం ఆప్రికన్ షెడ్యూల్ మొదలవుతుందట. ఆఫ్రికా ఖండంలో మొత్తంగా ఏడు దేశాల్లో షూటింగ్ ఉంటుందని సమా చారం. ఆ దేశాలు ఏంటి? అన్నది ఇంకా బయటకు రాలేదు. ఆఫ్రికా ఖండమంటే అడవులకు నిలయం. దట్టమైన అడవులతో కూడిన ప్రాంతంలో షూటింగ్ కూడా సవాల్ లాంటిందే.
