ఎస్ ఎస్ ఎంబీ 29 టార్గెట్ 10 వేల కోట్లా!
ఇండియన్ సినిమాల్లో ఇదో రికార్డు. ఇంత వరకూ ఏ భారతీయ చిత్రం ఇంత భారీ బడ్జెట్ రూపొందలేదు. ఆ సాహసకుడిగానూ రాజమౌళి పేరు భారతీయ చిత్ర పరిశ్రమలో నిలిచిపోతుంది.
By: Tupaki Desk | 5 Sept 2025 7:00 AM ISTఎస్ ఎస్ ఎంబీ 29 బాక్సాఫీస్ టార్గెట్ ఫిక్సైందా? ఏకంగా వరల్డ్ నే షేక్ చేయబోతున్నారా? మహేష్ -రామౌళి ప్రపంచాన్నే అల్లాడించబోతున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ అని నిన్నటితో కన్పమ్ అయింది. ఇంత వరకూ గ్లోబల్ స్థాయిలో సినిమా రిలీజ్ అవుతుంది? అన్నది కేవలం ఓ ప్రచారంగానే కనిపించింది. కానీ నిన్నటి రోజున కెన్యా ప్రభుత్వ అధికారుల భేటీతో ఇది పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ సినిమా అని తేలిపోయింది.
హాలీవుడ్ సినిమాకు సైతం సాధ్యం కానిది:
ఏకంగా 120 దేశాల్లో చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా విషయం బయటకు వచ్చేసింది. ఇన్ని దేశాల్లో సినిమా రిలీజ్ అంటే ఇంత వరకూ ఏ హాలీవుడ్ సినిమాకి కూడా సాధ్యం కాలేదు. ఓ రకంగా రిలీజ్ అన్నదే ఓ పెద్ద రికార్డు. ఇంత భారీ ఎత్తున రిలీజ్ నేపథ్యంలో ప్రఖ్యాత హాలీవుడ్ ఏజెన్సీలతో కలిసి రాజమౌళి పని చేస్తున్నారు. ప్రచారం దగ్గర నుంచి రిలీజ్ వరకూ అంతర్జాతీయంగా ఆయా ఏజెన్సీతో బిగ్ కుదుర్చుకున్నారు. భారీ కాన్సాస్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమా బడ్జెట్ అక్షరాలా 1200 కోట్లు అని తెలిసింది.
రాజమౌళి గ్లోబల్ ఇమేజ్ తోనే:
ఇండియన్ సినిమాల్లో ఇదో రికార్డు. ఇంత వరకూ ఏ భారతీయ చిత్రం ఇంత భారీ బడ్జెట్ రూపొందలేదు. ఆ సాహసకుడిగానూ రాజమౌళి పేరు భారతీయ చిత్ర పరిశ్రమలో నిలిచిపోతుంది. మరి 1200 కోట్లు బడ్జెట్ పెడుతున్నారంటే? బాక్సాఫీస్ టార్గెట్ ఎంత అంటే? 10,000 కోట్లు అని లీకులందుతున్నాయి. ట్రేడ్ వర్గాల్లో సైతం ఇదే డిస్కషన్ జరుగుతోంది. రాజమౌళికి ఉన్న గ్లోబల్ ఇమేజ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చిత్రాన్ని కోట్లాది మంది వీక్షించే అవకాశం ఉంటుందని ట్రేడ్ భావిస్తోంది.
1200 కోట్లతో పదివేల కోట్లు:
ఆయన గత రెండు పాన్ ఇండియా చిత్రాలకు రెట్టింపు అంచనాలతో రిలీజ్ అవుతున్న చిత్రంగా భావి స్తున్నారు. `బాహుబలి` రెండు భాగాలు కలిపి 2500 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అటుపై రిలీజ్ అయిన `ఆర్ ఆర్ ఆర్` 1300 కోట్ల వసూళ్లను రాబట్టింది. `బాహుబలి` మొత్తం బడ్జెట్ చూస్తే 500 కోట్ల లోపే ఉంది. `ఆర్ ఆర్ ఆర్` బడ్జెట్ 500 కోట్లు లోపే. ఈ చిత్రాలే అసాధారణ వసూళ్లు సాధించిన నేపథ్యంలో 1200 కోట్లతో తెరకెక్కిస్తోన్న మహేష్ సినిమా పదివేల కోట్లు టార్గెట్ అన్నది సమంజసమే అన్నది విశ్లే షకుల మాట. ప్రపంచ సినీ చరిత్రలో నిలిచిపోయే ఓ గొప్ప చిత్రమవుతుందని భావిస్తున్నారు.
