ఆగస్ట్ 9 కోసం ఎదురు చూస్తున్న మహేష్ ఫ్యాన్స్
ప్రతియేటా మహేష్ తన బర్త్ డే లేదా తన తండ్రి గారైన సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్ చెబుతుండేవారు.
By: Tupaki Desk | 6 July 2025 2:00 AM ISTమహేష్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూపులు చూస్తున్నారు. తమ ఫేవరెట్ హీరో నుంచి ఏదైనా సంథింగ్ స్పెషల్ న్యూస్ వస్తుందనేది వారి హోప్. సూపర్ స్టార్ మహేష్ ఈసారి ఫ్యాన్స్ కోరిక మేరకు చాలా పెద్ద విషయాన్ని ట్రై చేస్తున్నాడు. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సినిమాలో నటిస్తుండడం, అది కూడా తన కెరీర్ లో నెవ్వర్ బిఫోర్ అనేలా భారీ పాన్ ఇండియా చిత్రంలో నటించడం అందరినీ ఎగ్జయిట్ చేసింది.
అయితే మహేష్- రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న SSMB29 కి సంబంధించిన సరైన అప్ డేట్ ఎప్పుడు వస్తుందా? అని అందరూ ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆగస్టు 9 అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రతిసారీ మహేష్ బాబు తన పుట్టినరోజు కానుకగా ఆగస్టు 9న ఏదైనా గ్లింప్స్ అందిస్తున్నాడు. ఈసారి కూడా అలాంటి ఒక శుభవార్త చెబుతాడని అంతా భావిస్తున్నారు. మహేష్ బర్త్ డే రోజున కెరీర్ 29వ సినిమా గ్లింప్స్ ని విడుదల చేస్తారని అంతా భావిస్తున్నారు.
ప్రతియేటా మహేష్ తన బర్త్ డే లేదా తన తండ్రి గారైన సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్ చెబుతుండేవారు. కానీ ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ దివికేగారు గనుక, మహేష్ తన బర్త్ డే రోజున ప్రత్యేక విషయాన్ని ప్లాన్ చేస్తారని అభిమానులు భావిస్తున్నారు. ఈ ఏడాది మహేష్ బిగ్ డే కోసం జక్కన్న అండ్ టీమ్ ఎలాంటి ప్లాన్ చేసారో చూడాలన్న ఉత్కంఠ పెరుగుతోంది. మహేష్ బర్త్ డే కానుకగా ఫస్ట్ గ్లింప్స్ ఉంటుందని ఇంకా రాజమౌళి అండ్ టీమ్ అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతానికి సస్పెన్స్ కొనసాగుతోంది. ఇటీవలే రణబీర్ కపూర్ రామాయణం టీజర్ విడుదలైంది. అంతకుమించి రాజమౌళి ఏదైనా స్పెషల్ గ్లింప్స్ ని అందిస్తారని ఆశిస్తున్నారు.