Begin typing your search above and press return to search.

జ‌క్క‌న్న‌తో పాటు మ‌హేష్ కూడా ఎక్క‌డా త‌గ్గ‌ట్లే!

రాజ‌మౌళి `RRR` త‌రువాత కొంత విరామం తీసుకుని సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌తో ఓ భారీ హాలీవుడ్ రేంజ్ సినిమాకు శ్రీ‌కారం చుట్టిన విష‌యం తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 April 2025 1:21 PM IST
జ‌క్క‌న్న‌తో పాటు మ‌హేష్ కూడా ఎక్క‌డా త‌గ్గ‌ట్లే!
X

రాజ‌మౌళి `RRR` త‌రువాత కొంత విరామం తీసుకుని సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌తో ఓ భారీ హాలీవుడ్ రేంజ్ సినిమాకు శ్రీ‌కారం చుట్టిన విష‌యం తెలిసిందే. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని నిర్మాత కె.ఎల్‌. నారాయ‌ణ నిర్మిస్తున్నారు. ఎప్పుడో ఇచ్చిన మాట కోసం రాజ‌మౌళి ఈ సినిమాను ఆయ‌న‌కు చేస్తున్నారు. దాదాపు రూ.1000 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఇండియ‌న్ సినీ చ‌రిత్ర‌లోనే ఎవ‌రూ ఊహించ‌ని క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొందుతున్న ఈప్రాజెక్ట్ ని SSMB29 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్నారు.

గ‌త సినిమాల‌కు పూర్తి భిన్న‌మైన స్టైల్లో ఈ మూవీని రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నారు. గ‌తంలో ఒక్కో మూవీని నిదానంగా రోజులు, నెల‌లు, సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి చెక్కిన జ‌క్క‌న్న ఈ ప్రాజెక్ట్‌ని మాత్రం త‌న పంథాకు పూర్తి భిన్నంగా చాలా జాలీగా తెర‌కెక్కిస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. ఇటీవ‌లే ఈ మూవీకి సంబంధించిన కీల‌క షెడ్యూల్‌ని ఒడిశాలో పూర్తి చేయ‌డం తెలిసిందే. ఈ షెడ్యూల్‌తో షూటింగ్‌కి తాజాగా బ్రేక్ ఇచ్చారు.

రాజ‌మౌళి ఫ్యామిలీతో జాపాన్ లో ప‌ర్య‌టిస్తున్న నేప‌థ్యంలో ఈ మూవీ షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చారు. రాజ‌మౌళి డాక్యుమెంట‌రీని జ‌పాన్‌లో విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డి ప్రేక్ష‌కుల్ని క‌లుస్తూ ప్ర‌చారం చేస్తున్న రాజ‌మౌళి అక్క‌డే ఫ్యామిలీతో తిరుగుతున్నారు. ఇదిలా ఉంటే మ‌హేష్ బాబు కూడా త‌న ఫ్యామిలీతో క‌లిసి వెకేష‌న్‌కి వెళుతున్నార‌ట‌. ఈ ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందు సింహం బోనులో ఉన్న ఫొటోని షేర్ చేస్తూ మ‌హేష్ పాస్ పోర్ట్ త‌న వ‌ద్ద లాక్ అయింద‌ని సోష‌ల్ మీడియాలో రాజ‌మౌళి వెల్ల‌డించ‌డం అప్ప‌ట్లో వైర‌ల్ అయింది.

ఆ త‌రువాత మ‌హేష్ మ‌ళ్లీ త‌న పాస్ పోర్ట్ త‌న వ‌ద్ద‌కే వ‌చ్చేసింద‌ని సింబాలిక్‌గా చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశంగా మార‌డం తెలిసిందే. అయితే తాజాగా రాజ‌మౌళి `RRR` డాక్యుమెంట‌రీ రిలీజ్ కోసం జ‌పాన్ వెళ్ల‌డంతో మ‌హేష్ తాను కూడా వెకేష‌న్‌కి వెళ‌తాన‌ని జ‌క్క‌న్న‌తో చెప్పి మ‌రీ విహారానికి సిద్దం కావ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. మ‌హేష్‌ని ఈ ప్రాజెక్ట్ అయ్యే వ‌ర‌కు లాక్ చేయాల‌ని భావించిన జ‌క్క‌న ప్లాన్ బెడిసికొట్టింద‌ని, ఫ్యామిలీ వెకేష‌న్ విష‌యంలో జ‌క్క‌న్నతో మ‌హేష్ ఎక్క‌డా త‌గ్గ‌డం లేద‌ని ఫ్యాన్స్ కామెంట్‌లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.