Begin typing your search above and press return to search.

SSMB29: రాజమౌళి న్యూ ప్లాన్ సెట్టయినట్లే?

అయితే ఈ సినిమా షూటింగ్ ను కెన్యాలో ఓ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ లో మహేశ్​ బాబుపై ఇంట్రడక్షన్​ సీన్ చిత్రీకరించాలని ప్లాన్ చేశారు.

By:  Tupaki Desk   |   16 July 2025 5:03 PM IST
SSMB29: రాజమౌళి న్యూ ప్లాన్ సెట్టయినట్లే?
X

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. భారతీయ సినీ ఇండస్ట్రీలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఇది ఒకటి. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైనా ఇప్పటిదాకా అధికారికంగా ఒక్క అప్డేట్ రాలేదు. దీంతో ఫ్యాన్స్ అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా సినిమా షూటింగ్ కు సంబందించిన ఓ వార్త బయటకు వచ్చింది.

అయితే ఈ సినిమా షూటింగ్ ను కెన్యాలో ఓ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ లో మహేశ్​ బాబుపై ఇంట్రడక్షన్​ సీన్ చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. దాదాపు రెండు నెలల కిందటే కెన్యాలో షూటింగ్ కు ప్లాన్ చేసి అంతా రెడీ చేసుకున్నారు. కానీ, ప్రస్తుతం కెన్యాలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. దేశమంతా నిరసనలతో అట్టుడికిపోతుంది. ఈ నిరసనల్లో గతవారంలోనే 38 మంది మరణించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఇందులో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.

దీంతో భద్రతా కారణాల వల్ల అక్కడ షూటింగ్ చేయాలన్న ఆలోచనను మూవీ టీమ్ విరమించుకున్నట్లు తెలిసింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ వారమే కెన్యాలో షూటింగ్ ప్రారంభించాల్సి ఉంది. కానీ అక్కడ నెలకొన్న అంతర్గత పరిస్థితుల వల్ల అక్కడ షూటింగ్ నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో ఈ వారం షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం లేదు.

అయితే దీనికి ప్రత్యామ్నాయంగా రాజమౌళి టీమ్ టాంజానియా లేదా దక్షిణాఫ్రికా దేశాల్లో ప్రదేశాలను పరిశీస్తుందని సమాచారం. లొకేషన్ ను త్వరలోనే ఫిక్స్ చేసి కొత్త షెడ్యూల్‌ ను ఖరారు చేయాలని భావిస్తున్నారు. అయితే ఇక్కడే మరో విషయం ఏంటంటే, రాజమౌళి తన టీమ్ లో కీలక మార్పు చేశారని తెలుస్తుంది.

జక్కన్న తన దీర్ఘకాల సినిమాటోగ్రాఫర్ కె. కె. సెంథిల్ కుమార్‌ తో విడిపోయారు.గతంలో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆ, ఈగ, బాహుబలి సినిమాలు , మగధీర వంటి బ్లాక్‌ బస్టర్ చిత్రాలకు సెంథిల్​ పనిచేశారు. ఇప్పుడు మహేశ్ సినిమాకు మాత్రం ఆయన టీమ్ లో లేరు. సెంథిల్ స్థానంలో పి. ఎస్. వినోద్‌ను తీసుకున్నారు. ఇది పూర్తిగా రాజమౌళి వ్యక్తిగత నిర్ణయమేనట. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నారు. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. M M కీరవాణి సంగీతం అందిస్తుండగా, దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.