Begin typing your search above and press return to search.

జూనియర్ ట్రైలర్: ఎమోషనల్ కథలో కిరిటి యాక్షన్

కిరీటి రెడ్డి తొలి సినిమా కాబట్టి ప్రెషర్ ఉన్నా.. ట్రైలర్‌లో ఆయన నటన, డైలాగ్ డెలివరీ చూస్తే మంచి ఎఫర్ట్ పెట్టినట్టు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   11 July 2025 7:56 PM IST
జూనియర్ ట్రైలర్: ఎమోషనల్ కథలో కిరిటి యాక్షన్
X

వైరల్ వయ్యారి సాంగ్‌తో ముందుగానే యూత్‌లో బజ్ తెచ్చుకున్న జూనియర్ సినిమా.. ఇప్పుడు ట్రైలర్‌తో మరింత హైప్ క్రియేట్ చేసింది. యంగ్ హీరో కిరీటి రెడ్డి హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ట్రైలర్ ను ఎస్ ఎస్ రాజమౌళి విడుదల చేయడంతో సినిమా మీద ఉన్న ఆసక్తి మరోస్థాయికి చేరింది. వారాహి చలనచిత్రం బ్యానర్‌పై రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూలై 18న విడుదల కానుంది.

ట్రైలర్ విషయానికొస్తే.. యూత్‌ఫుల్ ఎనర్జీ, లవ్, కామెడీ, కుటుంబ బంధాలు అన్నీ మిక్స్ అయ్యి ఉన్నట్టే అనిపిస్తుంది. ఒకవైపు కాలేజ్ ప్రేమ కథ.. మరోవైపు కుటుంబానికి సంబంధించిన బాధ్యతల మధ్య నడిచే కథాంశం ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా కిరీటి పాత్రలో చిలిపితనం, తర్వాత వచ్చే మార్పు.. స్క్రీన్ మీద మంచి ఎమోషన్‌ను ప్రదర్శించబోతున్నట్టు స్పష్టమవుతోంది.

కథ ప్రకారం.. తల్లిదండ్రులకు లేటు వయసులో జన్మించిన కొడుకు కావడం వల్ల కిరిటి పై అమితమైన ప్రేమ పెంచుకుంటారు. ముఖ్యంగా తండ్రికి అతడిపై ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది. అలాంటి కుర్రాడు తన కాలేజీ రోజుల్లో స్పూర్తి అనే క్లాస్‌మేట్‌ని ప్రేమిస్తాడు. ఇక తండ్రి ప్రేమపై కొంత చిరాకు రావడం.. ఆ తరువాత ఓ సందర్భంలో తన తండ్రి ఊరి సమస్యలు తెలిసి బాధ్యత వహించాల్సి రావడం అనే అంశం చుట్టే సినిమా తిరుగుతుంది. ఈ కోణాన్ని చాలా ఫీల్‌తో దర్శకుడు చూపించబోతున్నట్టు ట్రైలర్‌ హింట్ ఇస్తోంది.

కిరీటి రెడ్డి తొలి సినిమా కాబట్టి ప్రెషర్ ఉన్నా.. ట్రైలర్‌లో ఆయన నటన, డైలాగ్ డెలివరీ చూస్తే మంచి ఎఫర్ట్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇక హీరోకు తోడు శ్రీలీల చిలిపితనం, ఎంటర్టైన్మెంట్ తో కలిపి క్రేజీ రొమాంటిక్ ట్రాక్ ఏర్పడింది. వీరిద్దరితో పాటు జెనీలియా కీలక పాత్రలో కనిపించి సీరియస్ టోన్‌కు బలం చేకూరుస్తుంది. డా. రవిచంద్ర పాత్ర అయితే హార్ట్ టచింగ్ లా ఉండబోతున్నట్టు భావిస్తున్నారు. వివా హర్ష, సత్య కామెడీ ట్రాక్‌ కూడా మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించబోతున్నదిగా కనిపిస్తోంది.

టెక్నికల్ గానే ట్రైలర్ చాలా ఆకట్టుకుంటోంది. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ స్క్రీన్‌ను కలర్‌ఫుల్‌గా మార్చగా.. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం వినగానే పావర్ నింపినట్టు అనిపిస్తోంది. పీటర్ హయిన్ ఫైట్స్ కూడా స్టైలిష్‌గా డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది. ట్రైలర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ అన్నీ మంచి ప్రొడక్షన్ వాల్యూస్‌తో రూపొందినట్టు స్పష్టమవుతోంది. మొత్తానికి జూనియర్ ట్రైలర్ మంచి ఎమోషన్, యాక్షన్, లవ్, ఫన్ కలగలిపిన కమర్షియల్ ప్యాకేజీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు హింట్ ఇస్తోంది. ఇక జూలై 18న థియేటర్లలో ఈ సినిమా ఆడియన్స్‌ను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.