ఆ మూడు కాంబినేషన్స్ పై జక్కన్న స్పెషల్ ఫోకస్!
అక్కడ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, వచ్చే సినిమాల్లో ఏ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారని అడిగిన ప్రశ్నకు రాజమౌళి ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
By: Tupaki Desk | 14 April 2025 12:12 AM ISTఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, తన సెన్సేషనల్ హిట్ ‘ఆర్ఆర్ఆర్’తో జపాన్ దేశంలో కూడా భారీ హిట్ సాధించాడు. అక్కడ అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా ‘ఆర్ఆర్ఆర్’ నిలిచింది. ఇప్పుడు ఆ సినిమా వెనుకకథను చూపించే డాక్యుమెంటరీ ‘RRR: Behind and Beyond’ జపాన్‌లో విడుదల కావడంతో, రాజమౌళి అక్కడ ప్రమోషన్ల కోసం వెళ్లారు.
అక్కడ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, వచ్చే సినిమాల్లో ఏ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారని అడిగిన ప్రశ్నకు రాజమౌళి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. “నాకు ఎక్కువగా ఎట్రాక్ట్ చేసే సినిమాలు మూడు ఉన్నాయి. ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న డ్రాగన్, ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో స్పిరిట్, రామ్ చరణ్ బుచిబాబు సానా కాంబినేషన్‌లో పెద్ది,” అంటూ వివరణ ఇచ్చారు.
ఈ మూడు సినిమాల్లో డ్రాగన్ పెద్ది షూటింగ్ దశలో ఉన్నాయి. కానీ స్పిరిట్ మాత్రం ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. అయినప్పటికీ, ఈ మూడు చిత్రాలు ఇండియన్ సినిమా రంగంలో భారీ అంచనాలు ఏర్పరచుకున్న ప్రాజెక్టులుగా నిలిచాయి. వీటి పై రాజమౌళి ఇలా స్పందించటం మరింత హైప్‌ను పెంచింది.
ఇక రాజమౌళి మాత్రం ప్రస్తుతం మహేష్ బాబుతో తన నెక్స్ట్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ SSMB29 పై పూర్తి దృష్టి పెట్టారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్, ఒడిశాలోని షెడ్యూల్స్‌ను ఇప్పటికే పూర్తి చేసుకుంది. కథ ప్రకారం ఇది అడ్వెంచర్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్‌తో కూడిన గ్రాండ్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా మరియు మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాను కెఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఎప్పటిలాగే సంగీతాన్ని ఎంఎం కీరవాణి అందిస్తున్నారు. ఓ వైపు సొంత సినిమా పనులతో బిజీగా ఉన్నా, రాజమౌళి ఇండస్ట్రీలోని మరో మూడు బిగ్ ప్రాజెక్టుల పట్ల చూపిన ఆసక్తి సినీ అభిమానులను ఎంతో ఉత్సాహపరిచింది. ఇక వీటి ప్రోగ్రెస్ ఏవిధంగా ఉంటుందన్నది చూడాల్సిందే.
