Begin typing your search above and press return to search.

ఆటగాడు రాజమౌళి.. కెమెరాల మధ్య చిక్కాడు..!

జపాన్ వీడియో గేమ్ మేకర్ కొజిమా ఇప్పటికి ఎన్నో సూపర్ గేమ్ లను ఇంట్రడ్యూస్ చేశాడు.

By:  Tupaki Desk   |   24 Jun 2025 10:27 PM IST
ఆటగాడు రాజమౌళి.. కెమెరాల మధ్య చిక్కాడు..!
X

దర్శక ధీరుడు రాజమౌళి సడెన్ గా కెమెరాల మధ్య జస్ట్ ఒక పలుచటి బనియన్ డ్రెస్ తోనే కనిపించాడు. అది కూడా ఒక ఆట కోసం అతను అలా సిద్ధమయ్యాడు. రాజమౌళిని అలా చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇంతకీ ఏంటా ఆట.. ఎందుకు రాజమౌళి అలా ఉన్నాడు అన్నది తెలుసుకోవాలంటే కాస్త డీటెయిల్స్ లోకి వెళ్లాల్సిందే.

డైరెక్టర్ రాజమౌళి ఆయన సినిమాల ప్రభావం ఎలాంటిదో ఇంటర్నేషనల్ లెవెల్ లో తెలిసేలా చేశాడు. RRR సినిమాతో ఆస్కార్ వేదిక మీద కూడా తన పాట అలరించేలా చేశాడు. అలాంటి రాజమౌళి కేవలం సినిమాలు తీయడమే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉన్న టాలెంటెడ్ పీపుల్ తో మంచి రిలేషన్ మెయిన్ టైన్ చేస్తూ ఉన్నాడు. అలా వీడియో గేమ్ మేకర్ కొజిమాతో రాజమౌళి పరిచయం ఆ తర్వాత ఆయన్ను ఒక వీడియో గేమ్ లో క్యామియోగా చూపించేలా చేసింది.

జపాన్ వీడియో గేమ్ మేకర్ కొజిమా ఇప్పటికి ఎన్నో సూపర్ గేమ్ లను ఇంట్రడ్యూస్ చేశాడు. ఆయన వీడియో గేమ్ వస్తుంది అంటే అందరు ఎదురుచూసేలా చేసుకున్నాడు. సక్సెస్ ఫుల్ వీడియో గేమ్ క్రియేటర్ అయిన హిడియో కొజిమా తన కొత్త వీడియో గేమ్ కోసం రాజమౌళి అయన కుమారుడు కార్తికేయని వాడుకున్నాడు.

కొజిమా విడియో గేమ్ లో సూపర్ సక్సెస్ అయిన డెత్ స్ట్రాండింగ్ కి సెకండ్ వెర్షన్ గా ఒక వీడియో గేమ్ రిలీజ్ చేస్తున్నారు. అందులో ఇప్పటికే నార్మన్ రీడస్, ఎల్లీ ఫానింగ్ ఇంకా లియా సెడాక్స్ లు కనిపించనున్నారు. వీరితో పాటు అడ్వెంచర్ డైరెక్టర్ రాజమౌళి ఇంకా అతను తనయుడు కార్తికేయ కూడా అందులో భాగం అవుతున్నారు.

ఈ వీడియో గేమ్ జూన్ 26న ప్లే స్టేషన్ 5 లో అందుబాటులో ఉంటుంది. ఇంతకీ రాజమౌళి కార్తికేయ ఎలా హిడియో కొనిమా వీడియో గేమ్ క్రియేటర్ కి తగిలారు అంటే.. 2022 లో RRR జపాన్ రిలీజ్ కోసం అక్కడికి వెళ్లగా ఆ టైం లో కొజిమా పరిచయం ఏర్పడింది. ఐతే అతనితో పరిచయం కాస్త ఇప్పుడు వీడియో గేమ్ లో ఒక క్యామియోగా కనిపించేలా చేసింది. ఏది ఏమైనా రాజమౌళి ఫ్యాన్స్ కి ఇది కచ్చీంగా ఒక క్రేజీ న్యూస్ అని చెప్పొచ్చు. వీడియో గేమ్ లో రాజమౌళి క్యామియోనే ఉంటుందని చెబుతున్నా అది కూడా చాలా గొప్ప విషయమని భావిస్తున్నారు తెలుగు ఆడియన్స్.