Begin typing your search above and press return to search.

ఆకాశం దాటి వస్తావా.. క్రేజీ సాంగ్ విన్నారా

అక్టోబర్ 27న సాయంత్రం 4:05 గంటలకి శృంగార అంటూ సాగే ఈ పాటని రిలీజ్ చేయబోతున్నారు. సాంగ్ కి సంబందించిన ప్రోమో తాజాగా రిలీజ్ చేశారు

By:  Tupaki Desk   |   26 Oct 2023 1:28 PM GMT
ఆకాశం దాటి వస్తావా.. క్రేజీ సాంగ్ విన్నారా
X

దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి మొదటి సినిమాగా బలగం వచ్చి ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు సెకండ్ మూవీగా ఆకాశం దాటి వస్తావా మూవీ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. హర్షిత్ రెడ్డి, హన్శిత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డాన్సర్ మాస్టర్ యశ్వంత్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు.

రొమాంటిక్ లవ్ స్టొరీతో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శశికుమార్ ముత్తులూరి ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సీరత్ కపూర్, కార్తీక మురళీధరన్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆకట్టుకుంది.

ప్రస్తుతం సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. అక్టోబర్ 27న సాయంత్రం 4:05 గంటలకి శృంగార అంటూ సాగే ఈ పాటని రిలీజ్ చేయబోతున్నారు. సాంగ్ కి సంబందించిన ప్రోమో తాజాగా రిలీజ్ చేశారు. హీరో, హీరోయిన్స్ మధ్య సాగే రొమాంటిక్ డ్యూయెట్ లా ఈ సాంగ్ ఉంది. సింగర్ కార్తిక్ ఈ చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు.

డైరెక్టర్ శశికుమార్ ముత్తులూరి ఈ సాంగ్ లెరిక్స్ రాయగా, సంజిత్ హెగ్డే, మాళవిక శంకర్ ఈ సాంగ్ ని ఆలపించారు. దిల్ రాజు తన కొడుకు, కూతురు నిర్మాతలుగా పెట్టిన సెకండ్ ప్రొడక్షన్ నుంచి ఆకాశం దాటి వస్తావా మూవీ వస్తోంది. బలగం లాగే ఈ సినిమా కూడా దిల్ రాజు టీంకి సూపర్ హిట్ ఇస్తుందో లేదో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

కొరియోగ్రాఫర్ గా సక్సెస్ అయిన యశ్వంత్ కూడా ఈ సినిమాతో హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. కృష్ణ అండ్ హిజ్ లీల, మా వింత గాఢ వినుమా సినిమాల తర్వాత తెలుగులో చేస్తోన్న మూవీ ఇదే కావడం విశేషం. మరి ఈ సినిమాతో సీరత్ కపూర్ కి ఎలాంటి సక్సెస్ వస్తుంది అనేది చూడాలి.