Begin typing your search above and press return to search.

మీరుండ‌గా అమ్మాయిలెందుకు సార్?

అమ్మాయిలు అంత మంది ఉన్నార‌ని లెక్కించ‌డం దేనికి? సినిమాలో నా లుక్స్ గురించి లెక్కించు.

By:  Tupaki Desk   |   11 Sep 2023 9:30 AM GMT
మీరుండ‌గా అమ్మాయిలెందుకు సార్?
X

షారుక్ ఖాన్ క‌థానాయుడిగా న‌టించిన 'జ‌వాన్' చిత్రంలో గాళ్స్ ఎక్కువ‌గానే క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. న‌య‌న‌తార లీడ్ లో మెప్పించినా..ఇంకా క‌థ అవ‌స‌రం మేర‌కు కొంత మంది న‌టీమ‌ణులు క‌నిపించారు. అయితే విజ‌యానందంలో భాగంగా షారుక్ న‌య‌న్ మిన‌హా మిగ‌తా వారంద‌రికి ఓ సెల్పీ దిగాడు. దాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసారు. ఈ ఫోటోని ఉద్దేశించి ఓ నెటిజ‌నుడు మీరుండ‌గా సినిమాలో ఇంత మంది అమ్మాయిలెందుకు? సార్ అని ఓ కామెంట్ పెట్టాడు.

అయితే ఈ కామెంట్ పై షారుక్ త‌న అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేసిన‌ట్లు క‌నిపిస్తుంది. అమ్మాయిలు అంత మంది ఉన్నార‌ని లెక్కించ‌డం దేనికి? సినిమాలో నా లుక్స్ గురించి లెక్కించు. మ‌హిళ‌ల్ని ప్రేమించి.. గౌర‌వించు.. త‌ల్లీకుమార్తెల‌కు నీ హృద‌యంలో స్థానం ఇవ్వు. వాళ్ల‌తో పాటు నువ్వు ముందుకెళ్లు అని బ‌ధులిచ్చారు. ఇప్పుడా వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఆ నెటి జ‌నుడు కేవ‌లం షారుక్ పై అభిమానంతోనే అలా స్పందిచాడు.

అక్క‌డ అమ్మాయిల్ని కించ ప‌ర‌చాలి అని కాదు. మీలాంటి పెద్ద స్టార్ ఉండ‌గా..వాళ్లంతా అవ‌స‌రం లేదు అన్న‌ట్లు గా స్పందించారు. ఆయ‌నేదో మ‌హిళా లోకాన్ని కించ ప‌రిచిన‌ట్లు మీ కామెంట్ ఉందంటూ మ‌రికొంత మంది నెటి జ‌నులు పోస్టులు వైర‌ల్ అవుతున్నాయి. ఇంకొంత‌ మంది నెటిజ‌న్లు షారుక్ కి మ‌ద్ద‌తు తెలిపారు. గ‌తంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ కూడా ఇలాగే ఓ అభిమాని స‌ర‌దాగా అడిగిన ప్ర‌శ్న‌కి కాస్త సీరియ‌స్ అయ్యే ప్ర‌య‌త్నం చేసారు.

ఆ త‌ర్వాత ప్ర‌శ్న పూర్తిగా అర్ద‌మైన త‌ర్వాత సారీ కూడా చెప్పారు. ఈ రెండు స‌న్నివేశాల్ని పోల్చుతూ స్నేహితులిద్ద‌రికి కాస్త తొంద‌ర ఎక్కువ అంటూ స‌ర‌దా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. మ‌హేష్‌-షారుక్ మంచి స్నేహితులు అన్న సంగ‌తి తెలిసిందే. జ‌వాన్ రిలీజ్ అనంత‌రం ఆ సినిమాని మ‌హేష్ ప్ర‌శంసించ‌డం... అందుకు షారుక్ రిప్లై ఇవ్వ‌డం ఇద్ద‌రి మ‌ధ్య సాన్నిహిత్యాన్ని తెలియ‌జేస్తుంది.