Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ కి సూపర్ స్టార్ హామీ..!

ఇకపై అంత గ్యాప్ తీసుకోను.. కేవలం రెండు నెలలే తీసుకుంటానని చెప్పారు. వరల్డ్ వైడ్ గా ఎంతోమంది తనపై అభిమానాన్ని చూపుతున్నారు.

By:  Tupaki Desk   |   31 Jan 2024 3:00 AM GMT
ఫ్యాన్స్ కి సూపర్ స్టార్ హామీ..!
X

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కొనేళ్లుగా ఏమాత్రం ఫాం లో లేరు. ఒకప్పుడు బాలీవుడ్ కింగ్ గా వరుస హిట్లు అందుకున్న షారుఖ్ హిట్ కోసం తపించి పోయారు. ఫైనల్ గా లాస్ట్ ఇయర్ షారుఖ్ ఖాన్ కి మాత్రమే కాదు ఆయన ఫ్యాన్స్ కి కూడా ఆకలి తీర్చేసింది. లాస్ట్ ఇయర్ జనవరిలో వచ్చిన పఠాన్ సెన్సేషనల్ హిట్ కాగా ఆ తర్వాత సౌత్ డైరెక్టర్ అట్లీతో చేసిన జవాన్ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇక డిసెంబర్ లో వచ్చిన డంకీ కూడా సూపర్ హిట్ గా నిలిచింది.


ఈ సినిమాలతో షారుఖ్ ఖాన్ తిరిగి సూపర్ ఫాం లోకి వచ్చారు. దాదాపు దశాబ్ద కాలం పైగా బాద్షా హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ అంతా ఒకే ఏడాదిలో 3 సూపర్ హిట్లు అందుకుని ఖుషి చేశాడు. అయితే ఈ సందర్భంగా రీసెంట్ ఇంటర్వ్యూలో షారుఖ్ తన ఫ్యాన్స్ కి హామీ ఇచ్చారు. పఠాన్ ముందు నాలుగేళ్లు గ్యాప్ తీసుకున్న షారుఖ్ ఆ విరామ సమయంలో ఫ్యాన్స్ అందరి ఆందోళనకు గురయ్యారని తెలిసింది.

33 ఏళ్లుగా మిమ్మల్ని అలరిస్తున్నాను.. మధ్యలో కొంత అనుకోని గ్యాప్ వచ్చింది. కొన్ని సినిమాలు ప్రేక్షకాదరణ పొందలేదు. నేను మంచి సినిమాలు ఎంచుకోవట్లేదేమో అని అనుకున్నా.. అందుకే కొద్దిపాటి విరామం తర్వాత పఠాన్, జవాన్, డంకీతో వచ్చాను.

ఇకపై అంత గ్యాప్ తీసుకోను.. కేవలం రెండు నెలలే తీసుకుంటానని చెప్పారు. వరల్డ్ వైడ్ గా ఎంతోమంది తనపై అభిమానాన్ని చూపుతున్నారు. వారి హృదయాల్లో తనపై శాశ్వత స్థానాన్ని ఇచ్చారు. అందుకు తన ఫ్యాన్స్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. షారుఖ్ ఖాన్. మూడు వరుస హిట్ల తర్వాత షారుఖ్ ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో ఒక లవ్ స్టోరీ చేస్తున్నారు. ఈ సినిమా కథ కూడా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తుంది.

షారుఖ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ కొడితే ఎలా ఉంటుందో లాస్ట్ ఇయర్ రిలీజైన 3 సినిమాల వసూళ్లను చూస్తే అర్థమైంది. కొన్నాళ్లు కథల ఎంపికల్లో సరైన నిర్ణయం తీసుకోలేని షారుఖ్ అటు చేస్తున్న సినిమాల ప్రభావం వల్ల కొంత గ్యాప్ తీసుకున్నారు. కానీ వరుస హ్యాట్రిక్ హిట్ మళ్లీ షారుఖ్ కి మంచి కిక్ ఇచ్చాయి. ఇక మీదట రెండు నెలలు మాత్రమే గ్యాప్ తీసుకుని వరుస సినిమాలు చేస్తానని ఫ్యాన్స్ కి చెప్పారు షారుఖ్.