Begin typing your search above and press return to search.

స్టార్ హీరో మేనేజ‌ర్ క‌ళ్లు భైర్లు క‌మ్మే సంపాద‌న‌

షారుఖ్ ఖాన్ సొంత మ‌నిషిలా భావించే, ఎంత‌గానో అభిమానించే స‌ద‌రు మేనేజర్ పేరు పూజా దద్లానీ.

By:  Tupaki Desk   |   9 Sep 2023 12:30 AM GMT
స్టార్ హీరో మేనేజ‌ర్ క‌ళ్లు భైర్లు క‌మ్మే సంపాద‌న‌
X

నటుడిగా ఉండటం చాలా కష్టమైన పని. స్టార్ డ‌మ్ ఉన్న హీరోకి వ్య‌వ‌హారికాలు అన్నీ ఇన్నీ కావు. కాబట్టి వారి విధుల‌పై అవగాహన ఉన్న వ్యక్తి, పనులను చాక‌చ‌క్యంగా నిర్వహిస్తూ, వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెట్ట‌డం తెలిసిన వ్య‌క్తి అన్నివేళ‌లా చాలా అవ‌స‌రం. కింగ్ ఖాన్ షారుఖ్ వేల కోట్ల సామ్రాజ్యానికి సృష్టిక‌ర్త అన్న సంగ‌తి తెలిసిందే. అయితే దానిని స‌వ్యంగా న‌డిపించేందుకు త‌న‌కు స‌హాయ‌కుల‌ను నియ‌మించుకున్నారు. ముఖ్యంగా త‌న సినిమా క‌మిట్ మెంట్లు స‌హా వ్యాపార విష‌యాల‌ను షేర్ చేసుకునే న‌మ్మ‌క‌మైన మేనేజ‌ర్ ని కూడా నియ‌మించుకున్నార‌నేది బాలీవుడ్ మీడియాల క‌థ‌నం. త‌న ఇంటి క‌ష్ట సుఖాల్లోను పాలుపంచుకునే సొంత మ‌నిషి త‌ర‌హా మేనేజ‌ర్ త‌న‌తో దశాబ్ధ కాలంగా ఉన్నారు.

షారుఖ్ ఖాన్ సొంత మ‌నిషిలా భావించే, ఎంత‌గానో అభిమానించే స‌ద‌రు మేనేజర్ పేరు పూజా దద్లానీ. త‌న‌తో 10 సంవత్సరాలుగా పని చేస్తోంది. ఆమె 2012లో ఖాన్ వ‌ద్ద ప‌నికి చేరింది. ఇప్పుడు ఆమె దాదాపు కుటుంబంలో ఒక భాగం. ఇటీవ‌ల షారూఖ్ వార‌సుడు ఆర్య‌న్ ఖాన్ క్రూయిజ్ షిప్ డ్ర‌గ్స్ పార్టీ కేసులో ఇరుక్కున్న‌ప్పుడు త‌న కోసం జైలుకు వెళ్లి సంర‌క్షించిన మ‌హిళ‌గా కూడా పూజా పేరు వినిపించింది.

2021లో ఆర్యన్ ఖాన్‌ను ఎన్‌సిబి అదుపులోకి తీసుకున్నప్పుడు కూడా పూజ పేరు ప్ర‌ముఖంగా హెడ్ లైన్స్ లో నిలిచింది. ఆర్య‌న్ కి బెయిల్‌ను కోర్టు తిరస్కరించడంతో పూజా విరుచుకుపడింది.

గ‌త ఫిబ్రవరిలో పూజా తన కొత్త ఇంట్లోకి ప్ర‌వేశించిన‌ప్పుడు అంద‌రి దృష్టిని ఆకర్షించింది. నిజానికి పూజా ఇంటిని డిజైన్ చేసింది మరెవరో కాదు.. షారూఖ్ భార్య‌, ప్ర‌ముఖ ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ గౌరీ ఖాన్. ఈ విష‌యాన్ని పూజా స్వ‌యంగా వెల్ల‌డించింది కూడా. అంతగా ఖాన్ ల కుటుంబంతో ఇమిడిపోయింది పూజా.

ముంబైలో పుట్టి పెరిగిన పూజా బాయి అవాబాయి ఫ్రామ్‌జీ పెటిట్ గర్ల్స్ హై స్కూల్ అండ్ H.R. కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుండి పాఠశాల విద్యను అభ్యసించింది. పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత R.D. అండ్ S.H కాలేజ్ లో మాస్ మీడియాలో డిప్లోమా చదివింది. నేషనల్ కాలేజీ అండ్ S.W.A. సైన్స్ కళాశాలలోను స్ట‌డీస్ ని కొనసాగించింది.

ఇంత‌కీ పూజా డ్యూటీస్ ఏంటి? అంటే.. షారూఖ్ ఖాన్ మేనేజర్‌గా అత‌డికి సంబంధించిన వ్యాపార లావాదేవీల‌ను చూస్తుంది. ఖాన్ సినిమా క‌మిట్ మెంట్లు, అతని బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లను, ఖాన్ కి చెందిన‌ క్రికెట్ టీమ్ కోల్‌కతా నైట్ రైడర్స్, నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ స‌హా ఇతర వ్యాపార సంబంధిత వ్య‌వ‌హారాల‌ను పూజా స‌మ‌ర్థంగా నిర్వహిస్తుంది.

ముంబైలోని లిస్టా జ్యువెల్స్ డైరెక్టర్ హితేష్ గుర్నానీని పూజ వివాహం చేసుకుంది. వీరికి ఒక అందమైన కూతురు ఉంది. దియా మీర్జా రెండవ భర్త వైభవ్ రేకీకి పూజా బంధువు. SRK మేనేజ‌ర్ గా ప‌ని చేస్తున్నందుకు ప్రతి సంవత్సరం 9 కోట్ల మేర పూజా సంపాదిస్తోంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికి ద‌శాబ్ధ కాలంగా షారూఖ్ కి మేనేజ‌ర్ గా ప‌ని చేస్తున్న పూజా దాదాపు 50 కోట్లు పైగా ఆర్జించింద‌ని క‌థ‌నాలొచ్చాయి. దీనిని బ‌ట్టి పూజాకు ఖాన్ ఎంత‌టి ప్రాధాన్య‌త‌నిస్తారో అర్థం చేసుకోవ‌చ్చు.