Begin typing your search above and press return to search.

'డంకీ'.. సక్సెస్ వాటి పైనే ఆధారపడి ఉందా?

ఈ ఇయర్ పఠాన్, జవాన్ లతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న షారుక్ 'డంకీ' తో హ్యాట్రిక్ హిట్ పై కన్నేసాడు

By:  Tupaki Desk   |   20 Dec 2023 4:50 PM GMT
డంకీ.. సక్సెస్ వాటి పైనే ఆధారపడి ఉందా?
X

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో షారు ఖాన్ నటించిన 'డంకీ' సినిమా రేపు(డిసెంబర్ 21) ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ తో ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ ని అందుకున్న ఈ సినిమాపై నార్త్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి పఠాన్, జవాన్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ తర్వాత షారుక్ నటిస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ ఇయర్ పఠాన్, జవాన్ లతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న షారుక్ 'డంకీ' తో హ్యాట్రిక్ హిట్ పై కన్నేసాడు. ఇక ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోష కంటెంట్ చూస్తే కచ్చితంగా డంకీతో షారుక్ కి హ్యాట్రిక్ ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఈ సినిమా సక్సెస్ కావాలంటే పాజిటివ్ రివ్యూలతో పాటు ఆడియన్స్ మౌత్ టాక్ చాలా కీలకం. ఎందుకంటే 'డంకీ' పఠాన్, జవాన్ సినిమాల లాగా కమర్షియల్ మూవీ కాదు.

కమర్షియల్ సినిమా అయితే యావరేజ్ టాక్ తోనే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని అందుకోవచ్చు. కానీ డంకీ మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ కాకుండా కంటెంట్ ని మాత్రమే నమ్మి బాక్సాఫీస్ బరిలోకి దిగుతోంది. ఇలాంటి కంటెంట్ బేస్డ్ సినిమాలకు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రావాలంటే ఆడియన్స్ నుండి యునానిమస్ పాజిటివ్ టాక్ రావాలి. దానికి తోడు మంచి రివ్యూస్ వస్తే కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకోవచ్చు.

కాబట్టి ఈ సినిమాకి ఆడియన్స్ ఆదరణ, పాజిటివ్ రివ్యూలు చాలా కీలకం. ఇప్పటివరకు రాజ్ కుమార్ హిరాని తీసిన ఐదు సినిమాలు భారీ ప్రేక్షకాదరణ పొందాయి. ఈ సినిమాలన్నీ కేవలం మౌత్ టాక్ తోనే బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు కొల్లగొట్టాయి. ఇప్పుడు డంకీ సినిమాకి కూడా షారుక్ ఫ్యాన్స్ అదే రెస్పాన్స్ ని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమాకి 'సలార్' లాంటి పాన్ ఇండియా మూవీ కాంపిటీషన్ గా వస్తుంది. ఇది కమర్షియల్ యాక్షన్ డ్రామా మూవీ.

డంకీ మూవీకి రాజ్ కుమార్ హిరాని, షారుక్ ఇద్దరూ నిర్మాతలు కావడంతో కమర్షియల్ గా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ సినిమా కేవలం రూ.85 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా రూ.240 కోట్ల థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకుంది. కాబట్టి ఫైనాన్షియల్ గా సినిమాపై ఎలాంటి ఒత్తిడి లేదు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అయిందని నిరూపించడానికి పఠాన్, జవాన్ సినిమాల స్థాయిలో కలెక్షన్స్ అందుకోవాలి. మరి ఆ రేంజ్ లో 'డంకీ' ఆ రేంజ్ లో కలెక్షన్స్ సాధిస్తుందేమో చూడాలి.