Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : చిల్‌ మూడ్‌ లో స్టార్ కిడ్‌ అందాల ఆరబోత

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌ కూతురు సుహాన ఖాన్‌ హీరోయిన్‌ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది

By:  Tupaki Desk   |   3 Aug 2023 12:30 PM GMT
పిక్ టాక్ : చిల్‌ మూడ్‌ లో స్టార్ కిడ్‌ అందాల ఆరబోత
X

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌ కూతురు సుహాన ఖాన్‌ హీరోయిన్‌ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. సుహాన ఖాన్ హీరోయిన్‌ గా పరిచయం అవ్వకుండానే సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఇన్ స్టా గ్రామ్‌ లో ఏకంగా నాలుగు మిలియన్ ల ఫాలోవర్స్ ను సుహాన కలిగి ఉంది.


తాజాగా సుహాన ఖాన్‌ గోవాలో స్నేహితులతో చిల్ అవుతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. సాధారణంగానే సుహాన ఖాన్ అందాలతో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈసారి అంతకు మించి అన్నట్లుగా సుహాన ఖాన్ క్యూట్‌ లుక్స్ తో ఆకట్టుకుంటూ ఉంది.

గతంలో సుహాన ఖాన్‌ హీరోయిన్‌ గా ఎంట్రీ ఇవ్వబోతుంది.. అదుగో సినిమా ప్రారంభం... ఇదుగో కథ రెడీ అన్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ సినిమా ఎక్కడ వరకు వచ్చింది అనే విషయం లో ఖాన్ ఫ్యామిలీ నుంచి క్లారిటీ రాలేదు.

ఈ స్టార్‌ కిడ్‌ హీరోయిన్ గా పరిచయం అవ్వకుండానే ఈ రేంజ్ లో ఫాలోయింగ్‌ ను దక్కించుకుంటే హీరోయిన్‌ గా ఎంట్రీ ఇస్తే ఏ స్థాయిలో ఫాలోయింగ్‌ ను సొంతం చేసుకుంటుందో కదా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందంగా ఉన్న సుహాన ఖాన్‌ ను ఎప్పుడెప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తారు అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు.