Begin typing your search above and press return to search.

బిడ్డ‌ల కోసం యాక్ష‌న్ చిత్రాలు చేస్తోన్న స్టార్!

బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ ఎక్కువ‌గా యాక్ష‌న్ చిత్రాలు చేస్తుంటారు. వాటిలో స‌క్సెస్ రేట్ కూడా బాగుంటుంది

By:  Tupaki Desk   |   7 Sep 2023 5:33 AM GMT
బిడ్డ‌ల కోసం యాక్ష‌న్ చిత్రాలు చేస్తోన్న స్టార్!
X

బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ ఎక్కువ‌గా యాక్ష‌న్ చిత్రాలు చేస్తుంటారు. వాటిలో స‌క్సెస్ రేట్ కూడా బాగుంటుంది. అందుకే ఆ ఫార్ములానే షారుక్ ఎప్పుడూ విడిచి పెట్ట‌రు. మ‌ధ్య మ‌ధ్య‌లో కొన్ని డిఫరెంట్ అటెంప్ట్స్ చేస్తున్న‌ప్ప‌టికీ మెయిన్ ఫోక‌స్ అంతా యాక్ష‌న్ కంటెంట్ మీద‌నే ఉంటుంది. ఇటీవ‌లే 'ప‌ఠాన్‌' తో భారీ విజ‌యాన్ని అందుకున్న షారుక్ 'జ‌వాన్' అనే మ‌రో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ తో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇది షారుక కెరీర్ లో భారీ యాక్ష‌న్ చిత్రం.

ఈ రేంజ్ యాక్ష‌న్ సినిమాలో షారుక్ ఇంత‌వ‌ర‌కూ క‌నిపించ‌లేదు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా రివీల్ చేసారు. బాలీవుడ్ లో ఎన్నో యాక్ష‌న్ సినిమాలు చేసాను..కానీ జ‌వాన్ లాంటి ఒళ్లు హూనం చేసిన సినిమా చేయ‌లేద‌ని చెప్పుకొచ్చారు. అంటే అట్లీ..షారుక్ ని ఎంత క‌ష్ట‌పెట్ట‌డాడో అర్ధం చేసుకోవ‌చ్చు. మ‌రి షారుక్ ఇలా యాక్ష‌న్ చిత్రాలు చేయ‌డం వెనుక అస‌లు కార‌కులు ఎవ‌రో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

అందుకు కార‌ణం షారుక్ కుమార్తె..కుమారుడు..చిన్న‌కుమారుడు ఆబ్రామ్. ముగ్గురు ఓరోజు షార‌క్ వ‌ద్దకు వ‌చ్చి కూల్ గా ఉండే సినిమాలు చేయ‌మ‌న్నారుట‌. అంటే యానిమేటెడ్ సూప‌ర్ హీరో యాక్ష‌న్ చిత్రాలు అన్ని చెప్పారుట‌. ఆ క్ష‌ణ‌మే సూప‌ర్ హీరోగా న‌టించాల‌నుకున్నారుట‌. అయితే సూప‌ర్ హీరో గెటప్ త‌న‌కి ఏమాతం సూట్ అవ్వ‌ద‌ని షారుక్ బ‌ల‌మైన నిర్ణ‌యం అట. అందుకే అలాంటి పాత్ర‌ల పోషించ‌డం కంటే నేరుగా యాక్ష‌న్ చిత్రాలే చేస్తే బాగుంటుంద‌ని భావించారుట‌.

అప్ప‌టి నుంచి ఎక్కువ‌గా యాక్ష‌న్ నేప‌థ్య‌మున్న క‌థ‌ల‌కే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తాన‌ని తెలిపారు. సిక్స్ ప్యాక్ లుక్ కూడా పిల్ల‌లో కోస‌మే తీసుకొచ్చా అన్నారు. పిల్ల‌లు అలాంటి కోరిక‌లు కోర‌క‌పోయి ఉంటే యాక్ష‌న్ సినిమాల‌కు నిజంగా దూరంగా ఉండేవాడినేమోన‌ని సందేహం వ్య‌క్తం చేసారు. అదే జ‌రిగితే అభిమానులు చాలా మిస్ అయ్యేవారు. షారుక్ యాక్షన్ సినిమాల‌కు చెవి కోసుకునే అభిమానులెంతో మంది ఉన్నారు.