మెట్ గాలా ఈవెంట్లో కళ్లన్నీ మెగాస్టార్‌పైనే
అతడు ఎక్కడ కనిపించినా అభిమానులు వెర్రిగా చిర్రెత్తిపోతారు. సెల్ఫీలు, ఫోటోషూట్లు అంటూ మీది మీదికి ఉరికి వస్తారు.
By: Tupaki Desk | 4 May 2025 1:00 PM ISTఅతడు ఎక్కడ కనిపించినా అభిమానులు వెర్రిగా చిర్రెత్తిపోతారు. సెల్ఫీలు, ఫోటోషూట్లు అంటూ మీది మీదికి ఉరికి వస్తారు. అలాంటి పరిస్థితి న్యూయార్క్ విమానాశ్రయంలో ఈ రోజు కనిపించింది. అక్కడ బాలీవుడ్ మెగాస్టార్ షారూఖ్ తనదైన సిగ్నేచర్ స్మైల్ కనబరుస్తూ, అభిమానులతో సెల్ఫీలు దిగి, అందరినీ ఛీర్ చేయడం ఆకర్షించింది. అమెరికాలో ఖాన్ కి ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో ఈ విమానాశ్రయంలో అభిమానుల ప్రదర్శన స్పష్టం చేసింది.
అదే సమయంలో కింగ్ ఖాన్ ఫ్యాషన్ సెన్స్ కూడా చర్చగా మారింది. అతడు సింపుల్ టీషర్ట్, బూడిద రంగు హుడీ ధరించి నీలి రంగు కార్గోస్ తో ప్రత్యేకంగా కనిపించాడు. మెడలో అందమైన పెండెంట్ నెక్లెస్ కూడా ప్రత్యేక ఆకర్షణగా మారింది. చేతిలో ఐప్యాడ్ తో స్టైలిష్ గా కనిపించిన ఖాన్ లో రాజసం ఉట్టిపడుతోంది. కింగ్ ఎక్కడ ఉన్నా కింగే. అందులో డౌట్ లేదంటూ అభిమానులు అతడిని ప్రశంసిస్తున్నారు. తదుపరి షారూఖ్ యాధృచ్ఛికంగానే కింగ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నటవారసురాలు సుహానా కూడా కీలక పాత్రను పోషిస్తోంది.
ఇకపోతే ఖాన్ రెడ్ కార్పెట్ ఈవెంట్లో ఎలాంటి దుస్తులు ధరిస్తాడో చూడాలని అభిమానులు తహతహలాడుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి షారూఖ్ ఖాన్ రెడ్ కార్పెట్ బృందంపై ఉంది. ప్రముఖ భారతీయ కోటురియర్ సబ్యసాచి ప్రత్యేకంగా రూపొందించిన దుస్తులను అతడు ధరించనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ వేదికపై భారతీయ శైలి, చేనేతను ఈ వేదికపై ప్రమోట్ చేస్తారని తెలుస్తోంది.
మెట్ గాలా ఈవెంట్లో షారూఖ్ తో పాటు.. త్వరలో తల్లి కాబోతున్న కియారా అద్వానీ గౌరవ్ గుప్తా రూపొందించిన కస్టమ్ దుస్తుల్లో కనిపించనుంది. ఈ జంటతో పాటు గాయకుడు-నటుడు దిల్జిత్ దోసాంజ్ తన మొదటి మెట్ గాలా ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నాడు. ఈ గ్రాండ్ ఫ్యాషన్ ఈవెంట్ 5 మే 2025న జరుగనుంది. ఈ వేడుక ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరగనుందని సమాచారం.
