Begin typing your search above and press return to search.

పవన్ సినిమా కోసం టబు... నిజమేనా?

ఉత్తరాదిన స్టార్‌ హీరోయిన్ గా మారిన తర్వాత తెలుగు లో టబు పెద్దగా చేసిందే లేదు

By:  Tupaki Desk   |   20 May 2024 5:10 AM GMT
పవన్ సినిమా కోసం టబు... నిజమేనా?
X

సౌత్‌ నుంచి వెళ్లి బాలీవుడ్ లో పర్మినెంట్‌ గా స్థిర పడ్డ హీరోయిన్ టబు. ఉత్తరాదిన స్టార్‌ హీరోయిన్ గా మారిన తర్వాత తెలుగు లో టబు పెద్దగా చేసిందే లేదు. అయితే అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్‌ అల వైకుంఠపురంలో సినిమా తర్వాత టబు వరుసగా తెలుగు సినిమాలు చేస్తుందని అంతా భావించారు.

ఆ సినిమా భారీ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత టబు వద్దకు చాలా మంది తెలుగు దర్శక నిర్మాతలు వెళ్లారట. కానీ టబు హిందీ సినిమాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. పవన్ కళ్యాణ్‌ తో సాహో సుజీత్‌ రూపొందిస్తున్న ఓజీ సినిమా కోసం కూడా టబు ను సంప్రదించారు అనే ప్రచారం జరుగుతోంది.

ఓజీ సినిమాలోని ముఖ్య పాత్రకు టబును అనుకున్నారని, కానీ ఆమె నుంచి స్పందన లేక పోవడంతో ఆ పాత్రకు శ్రియా రెడ్డిని తీసుకున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఆ విషయం నిజమే అన్నట్లుగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో శ్రియా రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

శ్రియా రెడ్డి నటించిన ఓ వెబ్‌ సిరీస్ స్ట్రీమింగ్‌ కు రెడీ అయ్యింది. ఆ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్ లో భాగంగా టబు అంటే తనకు చాలా అభిమానం అని, ఆమె చేయాల్సిన ఒక తెలుగు సినిమా పాత్రను నేను చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది.

శ్రియా రెడ్డి చెప్పింది ఓజీ లో తాను చేస్తున్న పాత్ర గురించి అయ్యి ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. కానీ కొందరు మాత్రం సలార్‌ లో రాధా మన్నార్ పాత్రకు టబును అనుకున్నారా.. టబు అందుకు నో చెబితే శ్రియా రెడ్డిని తీసుకున్నారా అనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి తెలుగు లో ఒక స్టార్‌ హీరో సినిమాను టబు కాదు అనుకోవడం, ఆ సినిమాలో శ్రియా రెడ్డి నటించడం అనేది కన్ఫర్మ్‌. ఆ సినిమా ఏది అనేది మాత్రం అనేక పుకార్లు ఉన్నాయి. అఫిషియల్‌ గా శ్రియా రెడ్డి పేరు చెబితే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఏది ఏమైనా టబు తెలుగు సినిమాలను తిరస్కరించడం సరైన నిర్ణయం కాదని తెలుగు సినీ ప్రేమికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.