Begin typing your search above and press return to search.

హెవీ వర్కౌట్స్.. సలార్ కోసం శ్రియ అంతలా కష్టపడిందా?

అయితే సలార్ మూవీ షూటింగ్ సమయంలో తన డైలీ రొటీన్ ను తాజాగా షేర్ చేసింది శ్రియా రెడ్డి. పుషప్స్ చేస్తున్న వీడియోలను పోస్ట్ చేసింది.

By:  Tupaki Desk   |   12 Jan 2024 5:58 AM GMT
హెవీ వర్కౌట్స్.. సలార్ కోసం శ్రియ అంతలా కష్టపడిందా?
X

పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సలార్ సినిమా తర్వాత టాలీవుడ్ లో శ్రియా రెడ్డి పేరు మార్మోగిపోయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అమ్మడు పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. శ్రియా రెడ్డి టాలెంట్ కు త‌గ్గ రోల్ పడితే పెర్ఫార్మెన్స్ ఇవ్వ‌డంలో ఆమెకే ఆమె సాటి అని మరోసారి నిరూపించింది. శ్రుతిహాసన్ కన్నా ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది.

సలార్ మూవీలో శ్రియా రెడ్డి.. రాధా రామ మన్నార్ పాత్రలో కనిపించింది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన వరదరాజ మన్నార్ కు సోదరిగా నటించింది. సినిమా చూసిన తర్వాత ఆమె పాత్రను చాలా మంది బాహుబలిలో శివగామి రోల్ తో పోల్చారు. పవర్ ఫుల్ పాత్రలకు శ్రియా రెడ్డి కేరాఫ్ అడ్రస్ అని కొనియాడారు.

అయితే సలార్ మూవీ షూటింగ్ సమయంలో తన డైలీ రొటీన్ ను తాజాగా షేర్ చేసింది శ్రియా రెడ్డి. పుషప్స్ చేస్తున్న వీడియోలను పోస్ట్ చేసింది. షూట్ సమయంలో తాను చికెన్ తందూరితో పాటు టమాటా, దోసకాయ, క్యారెట్ ముక్కలను తిన్నట్లు తెలిపింది. రాధా రామ గెటమ్ లో కూడా వర్కౌట్స్ చేస్తున్న వీడియా కూడా పోస్ట్ చేసింది.

అయితే టాలీవుడ్ లో వరుస పెట్టి చిత్రాలు చేస్తున్న ఈ అమ్మడు.. పవన్ కల్యాణ్ ఓజీలోనూ నటిస్తోంది. సుజిత్ ఈమె పాత్రను చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేశారని తెలుస్తోంది. దీంతో యాక్షన్ సీన్లలో ఒదిగిపోయేందుకు శ్రియ జిమ్ లో హెవీ వర్కౌట్ చేస్తోంది. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను ఇటీవలే పంచుకుంది.

2002 లో స‌మురాయ్ సినిమాతో ఇండస్ట్రీలోకి శ్రియా రెడ్డి అడుగుపెట్టింది. ఆ త‌ర్వాత అప్పుడప్పుడు మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక విశాల్ పొగరు సినిమాతో న‌టిగా బాగా ఫేమ‌స్ అయింది. సౌత్ లో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో శ్రియా రెడ్డి న‌ట‌న నెక్స్ట్ లెవ‌ల్ లో ఉంటుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు కొన్నేళ్లపాటు దూరంగా ఉంది. మధ్యలో ఓ రెండు సినిమాలు చేసినా.. సలార్ తో అదిరిపోయేలా రీఎంట్రీ ఇచ్చింది.

సలార్ రెండో పార్ట్ లోనూ శ్రియా నటిస్తోంది. రాధా రామ మన్నార్ పాత్రకు మంచి పేరు రావడంతో మరిన్ని అవకాశాలు కూడా ఆమెకు వస్తున్నాయి. గతేడాది వరకు కూడా అమెరికాలో ఉన్న ఆమె.. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. 2023లో ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన సుడల్ అనే వెబ్ సిరీస్ లోనూ ఆమె నటించింది.