Begin typing your search above and press return to search.

ప్రశాంత్ నీల్ చెత్త అలవాటు.. లేడీ మన్నార్‌ కామెంట్స్‌

ఆ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్‌ లో రెగ్యులర్ గా సలార్ గురించి ముచ్చట్లను శ్రియా రెడ్డి చెబుతూనే ఉంది.

By:  Tupaki Desk   |   20 May 2024 5:03 AM GMT
ప్రశాంత్ నీల్ చెత్త అలవాటు.. లేడీ మన్నార్‌ కామెంట్స్‌
X

గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సలార్‌ సినిమాలో కీలకమైన లేడీ మన్నార్‌ పాత్రలో కనిపించిన శ్రియా రెడ్డి తాజాగా తలమై సేయలగం అనే వెబ్‌ సిరీస్‌ లో నటించింది. ఆ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్‌ లో రెగ్యులర్ గా సలార్ గురించి ముచ్చట్లను శ్రియా రెడ్డి చెబుతూనే ఉంది.

సెకండ్‌ పార్ట్‌ అప్‌డేట్స్ తో పాటు మొదటి పార్ట్‌ షూటింగ్‌ కు సంబంధించిన విషయాలను ఆమె పదే పదే మీడియా ముందు ముచ్చటిస్తూ వచ్చింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో లేడీ మన్నార్‌ శ్రియా రెడ్డి మాట్లాడుతూ దర్శకుడు ప్రశాంత్‌ నీల్ కు ఉన్న ఒక చెడ్డ అలవాటు, చెత్త అలవాటు గురించి చెప్పుకొచ్చింది.

సాధారణంగా నేను ఏ సినిమా షూటింగ్‌ కు వెళ్లినా కూడా ముందుగా నాకు ఆ రోజుకు సంబంధించిన సీన్స్ లోని డైలాగ్స్ ప్రాక్టీస్‌ చేయడం అలవాటుగా వస్తుంది. కానీ సలార్ సినిమా షూటింగ్‌ సమయంలో నాకు చాలా కోపం వచ్చే విధంగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ చేసేవాడు.

ప్రశాంత్‌ నీల్‌ డైలాగ్స్ ను సెట్స్ లోనే రాసేవాడు. ఎక్కువ శాతం ఆయన డైలాగ్స్ అప్పటికప్పుడు ఇచ్చేవాడు. వాటిని నేను చెప్పడానికి చాలా కష్టపడేదాన్ని. ఆ సమయంలో ఆయన్ను చంపేయాలి అన్నంత కోపం వచ్చేది అంటూ నవ్వుతూ చెప్పింది.

అది నాకు అతి పెద్ద చెత్త అలవాటుగా అనిపించేది. నాకు ఇబ్బందిగా ఉంటే ప్రాంప్ట్‌ చెప్పిస్తాం అనేవారు. కానీ నాకు నటించే సమయంలో ప్రాంప్ట్‌ చెప్పడం అస్సలు ఇష్టం ఉండదు. అందుకే స్పీడ్‌ స్పీడ్‌ గా డైలాగ్స్ ను నేర్చుకుని ఆ తర్వాత కెమెరా ముందుకు వెళ్లేదాన్ని అంది.

సాధారణంగా చాలా మంది దర్శకులు డైలాగ్‌ వర్షన్‌ తో స్క్రిప్ట్‌ పూర్తి చేసుకుని ఆ తర్వాత సెట్స్ కి వెళ్తారు. కానీ దర్శకుడు ప్రశాంత్‌ నీల్ మాత్రం డైలాగ్స్‌ ను సెట్స్ లో అప్పటికప్పుడు రాస్తాడనే విషయం ను శ్రియా రెడ్డి రివీల్‌ చేయడం అందరికి ఆశ్చర్యంను కలిగిస్తుంది. అంత తక్కువ సమయంలో అద్భుతమైన డైలాగ్స్ ను ప్రశాంత్‌ నీల్ ఎలా రాయగలుగుతారు అంటూ అంతా అవాక్కవుతున్నారు.