Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ కు-నాకు ఉన్న రిలేష‌న్ స‌స్పెన్స్!

మ‌రి ఇందులో ఆమె రోల్ ఎలా ఉండ‌బోతుంది? అంటే ఆమె ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. 'ఓజీ'లో న‌టిస్తున్నా. దీని కోసం సుజిత్ అద్భుత‌మైన క‌థ రెడీ చేసారు.

By:  Tupaki Desk   |   27 Dec 2023 5:25 AM GMT
ప‌వ‌న్ కు-నాకు ఉన్న రిలేష‌న్ స‌స్పెన్స్!
X

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయుడిగా సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ అంచ‌నాల మ‌ధ్య 'ఓజీ' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కొద్ది భాగం షూటింగ్ కూడా పూర్త‌యింది. గ్యాంగ్ స్ట‌ర్ నేప‌థ్యంలో చిత్రం రూపొందుతుంది. 'పంజా' త‌ర్వాత ప‌వ‌న్ గ్యాంగ్ స్ట‌ర్ అవ‌తారం ఎత్త‌డంతో అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఇప్ప‌టికే రిలీజ్ అయిన పీకే లుక్ అభిమానుల్లో కాక పుట్టిస్తోంది. ఇక ఇదే సినిమాలో ఫేమ‌స్ న‌టి శ్రియా రెడ్డి కూడా కీలక పాత్ర పోషిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

'స‌లార్' లో సినిమాతో శ్రియారెడ్డి పేరు మ‌రోసారి పాన్ ఇండియాలో మారు మ్రోగిపోతుంది. రాధ‌ర‌మ పాత్ర‌లో శ్రియా రెడ్డి ఆహార్యం..న‌ట‌న ప్ర‌తీది ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతినిచ్చింది. అంత‌కు ముందు 'పొగ‌రు' సినిమాతోనూ శ్రియా టాలీవుడ్ కి బాగా సుప‌రిచిత‌మే. అయితే చాలా గ్యాప్ త‌ర్వాత ఆమె మ‌ళ్లీ కంబ్యాక్ స‌లార్ తో కంబ్యాక్ అయ్యారు. ఈనేప‌థ్యంలో ఓజీలో సైతం ఛాన్స్ అందుకోవ‌డంతో అమ్మ‌డి పేరు హాట్ టాపిక్ గా మారుతోంది.

మ‌రి ఇందులో ఆమె రోల్ ఎలా ఉండ‌బోతుంది? అంటే ఆమె ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. 'ఓజీ'లో న‌టిస్తున్నా. దీని కోసం సుజిత్ అద్భుత‌మైన క‌థ రెడీ చేసారు. ఎమోష‌న‌ల్ రోల‌ర్ కోస్ట‌ర్ రైడ్ లా ఉంటుంది. 50 శాతం యాక్ష‌న్..మ‌రో 50 శాతం బ‌ల‌మైన బావోద్వేగాల‌తో నిండిఉంటుంది. ఇందులో నా పాత్ర విల‌నీ అయితే కాదు. సినిమాలో నాకు-ప‌వ‌న్ పాత్ర‌కు ఉన్న రిలేష‌న్ ఏంట‌న్న‌ది స‌స్పెన్స్. నా పాత్ర‌కి సంబంధించి చిత్రీక‌ర‌ణ ఇంకా పూర్తి కాలేదు. ఓ ఫైట్ స‌న్నివేశాన్ని పూర్తి చేయాల్సి ఉంది.

ఓజీ పూర్త‌యిన త‌ర్వాత న‌ట‌న నుంచి పూర్తిగా రిటైర్మెంట్ తీసుకున్నా ప‌ర్వాలేదు అనిపిస్తుంది. ఆ పాత్ర అంత గొప్ప‌గా ఉంటుంది. దాన్ని ద‌ర్శ‌కు డు చాలా ప్ర‌త్యేకంగా రాసారు అనిపిస్తుంది. నేనెప్పుడు కేవ‌లం సీరియ‌స్ పాత్ర‌లే చేయాల‌నుకోను. విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లు చేయాల‌ని ఉంటుంది. కానీ నాకు ఎక్కువ‌గా నెగిటివ్ పాత్ర‌లే వ‌స్తున్నాయి. ఈ నా స‌మ‌స్య‌ను ద‌ర్శ‌కుల‌కు ఎలా చెప్పాలో అర్దం కావ‌డం లేదంటూ' న‌వ్వేసారు.