Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో మ‌రో లేడీ విల‌న్

ఆమె లుక్ కి..న‌ట‌న‌కు మంచి మార్పులు ప‌డ్డాయి. శ్రియా రెడ్డి పాత్ర‌ని ఏకంగా 'బాహుబ‌లి'లో శివ‌గామి ర‌మ్య‌కృష్ణ పాత్ర‌తోనే పోల్చుతున్నారు.

By:  Tupaki Desk   |   25 Dec 2023 6:34 AM GMT
టాలీవుడ్ లో మ‌రో లేడీ విల‌న్
X

టాలీవుడ్ ల్ మ‌ళ్లీ శ్రియా రెడ్డి పేరు మారిమ్రోగిపోతున్న సంగ‌తి తెలిసిందే. 'స‌లార్' సినిమాలో అమ్మ‌డి పాత్ర‌కి మంచి గుర్తింపు ద‌క్కింది. శ్రియా రెడ్డి ట్యాలెంట్ కి త‌గ్గ రోల్ పడితే పెర్పార్మెన్స్ ఇవ్వ‌డంలో ఆమెకే ఆమె సాటి అని ఎన్నో సినిమాల్లో నిరూపించింది. చేసింది కొన్ని సినిమాలే అయినా న‌ట‌న‌ల‌తో త‌న‌దైన మార్క్ త‌ప్ప‌నిస‌రిగా ప‌డుతుంది. 'స‌లార్' లో వ‌ర‌ద‌రాజు సోద‌రి పాత్ర‌లో మ‌రోసారి అద‌ర‌గొట్టేసింది.

ఆమె లుక్ కి..న‌ట‌న‌కు మంచి మార్పులు ప‌డ్డాయి. శ్రియా రెడ్డి పాత్ర‌ని ఏకంగా 'బాహుబ‌లి'లో శివ‌గామి ర‌మ్య‌కృష్ణ పాత్ర‌తోనే పోల్చుతున్నారు. దీంతో శ్రియా రెడ్డి పేరు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. శ్రియా రెడ్డిని చాలా మంది కొత్త న‌టి అనుకుంటున్నారు? కానీ ఆమె చాలా సీనియ‌ర్ న‌టి . 2002 లోనే 'స‌మురాయ్' అనే సినిమాతో త‌మిళ్ లో తెర‌గేంట్రం చేసారు. ఆ త‌ర్వాత 'అప్పుడప్పుడు' అనే సినిమాతో టాలీవుడ్ లో నూ లాంచ్ అయ్యారు.

అటుపై 'అమ్మ చెప్పింది'లో న‌టించారు. అయితే ఇవేవి ఇక్క‌డ పెద్ద గుర్తింపు తీసుకురాలేదు. విశాల్ తో న‌టించిన 'పొగరు' సినిమాతో న‌టిగా బాగా ఫేమ‌స్ అయ్యారు. అందులో పొగ‌ర‌బోతు లేడీ విల‌నీ పాత్ర‌లో శ్రియా రెడ్డి న‌ట‌న నెక్స్ట్ లెవ‌ల్లో ఉంటుంది. ఆ సినిమాతోనే సౌత్ లో బాగా ఫేమ‌స్ అయ్యారు. అటుపై త‌మిళ్..మ‌ల‌యాళంలోనూ సినిమాలు చేసారు. అయితే 2008 లో హీరో విశాల్ అన్న‌య్య విక్ర‌మ్ కృష్ణ‌తో వివాహం జ‌రిగింది.

ఆ త‌ర్వాత శ్రియా రెడ్డి చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. గ‌తేడాది వ‌ర‌కూ అమెరికాలోనే ఉన్నారు. మ‌ధ్య‌లో ఒక‌టి రెండు సినిమాలు చేసారు. కానీ కంటున్యూ చేయ‌లేదు. అయితే కంబ్యాక్ గ్రాండ్ గా ఉండాల‌ని గ‌తేడాది మ‌ళ్లీ సిరియ‌స్ గా యాక్టింగ్ వైపు దృష్టి సారించారు. ఈ నేప‌థ్యంలోనే 'స‌లార్' లో ఛాన్స్ అందుకున్నారు. ప్ర‌స్తుతం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న 'ఓజీ'లో కూడా కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఇక‌పై ఆమె కి అవ‌కాశాలు క్యూ క‌ట్ట‌డం ఖాయం. లేడీ విల‌న్ గా ఆమెకి మంచి గుర్తింపు ఉన్న నేప‌థ్యంలో తెలుగు అవ‌కాశాలు రావ‌డం ఖాయంగా చెప్పొచ్చు.