Begin typing your search above and press return to search.

హిట్‌ మూవీ ప్రీక్వెల్‌ కి ఇదేం టైటిల్ భయ్యా?

కానీ ఏమాత్రం సంబంధం లేనట్లుగా 'స్వాగ్‌' అని ఎందుకు పెట్టారు అనేది తెలియడం లేదు.

By:  Tupaki Desk   |   31 July 2023 6:37 AM GMT
హిట్‌ మూవీ ప్రీక్వెల్‌ కి ఇదేం టైటిల్ భయ్యా?
X

టాలీవుడ్ లో చాలా మంది యంగ్ హీరోలు ఉన్నారు. అయితే వారిలో కొద్ది మంది మాత్రమే విభిన్నమైన సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు అయినా ప్రేక్షకుల దృష్టిలో పడుతున్నారు. అలాంటి వారిలో శ్రీవిష్ణు ఒకరు. ఈయన కెరీర్‌ ఆరంభం నుండి రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలు కాకుండా విభిన్నంగా ఉంటూ ఆకట్టుకునే సినిమాలు చేయాలని ఆశ పడుతూ వస్తున్నాడు.

అందులో భాగంగానే బ్రోచేవారెవరురా వంటి హిట్ మూవీ వచ్చింది. ఆ తర్వాత రాజ రాజ చోర అనే సినిమా ను కూడా ఈ యంగ్‌ హీరో చేయడం జరిగింది. విభిన్నమైన కాన్సెప్ట్‌ తో వచ్చిన రాజ రాజ చోర సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా సామజవరగమన అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్‌ హిట్ ను దక్కించుకున్నాడు.

సామజవరగమన సినిమా హిట్ నేపథ్యం జోష్ మీద ఉన్న శ్రీ విష్ణు తన సూపర్‌ హిట్‌ మూవీ రాజ రాజ చోర కి ప్రీక్వెల్‌ చేసే పనిలో నిమగ్నం అయ్యాడు. రాజ రాజ చోర సినిమా లో సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్ అంటూ చెప్పుకుంటూ దొంగతనాల కు పాల్పడుతూ ఉంటాడు. సీక్వెల్‌ లో హీరో దొంగత మారడంకు కారణంను విభిన్నంగా చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

నూరు శాతం ప్రీక్వెల్‌ అన్నట్లుగా కాకుండా కాన్సెప్ట్‌ ను తీసుకుని ప్రీ క్వెల్‌ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ప్రీ క్వెల్‌ కు 'స్వాగ్‌' అనే టైటిల్ ను ఖరారు చేయడం జరిగింది. రాజ రాజ చోర వంటి విభిన్నమైన టైటిల్‌ సినిమా కి ప్రీక్వెల్‌ అంటే కాస్త అటు ఇటుగా టైటిల్ అలాగే ఉండాలి. కానీ ఏమాత్రం సంబంధం లేనట్లుగా 'స్వాగ్‌' అని ఎందుకు పెట్టారు అనేది తెలియడం లేదు.

రాజ రాజ చోర సినిమా తో ఈ సినిమాకి సంబంధం ఉండదు అని చెప్పేందుకు ఇలా విభిన్నమైన టైటిల్‌ ను ఎంపిక చేసి ఉంటారా అనేది తెలియాల్సి ఉంది. హిట్ మూవీ ప్రీక్వెల్‌ టైటిల్‌ విషయం లో ప్రస్తుతానికి కొందరికి అసంతృప్తి ఉన్నప్పటికి విడుదల సమయం కు.. విడుదల తర్వాత కచ్చితంగా తమ ఉద్దేశం మార్చుకునే అవకాశం ఉందని.. భలే టైటిల్ ను ఫిక్స్ చేశారే అన్నట్లుగా ప్రేక్షకులు మాట్లాడుకుంటారని యూనిట్‌ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు.