Begin typing your search above and press return to search.

యూఎస్ లో శ్రీవిష్ణు బిగ్గెస్ట్ రికార్డ్

చిన్న హీరోల లో వన్ మిలియన్ కి పైగా కలెక్షన్స్ ని ఓవర్సీస్ మార్కెట్ లో సాధించిన హీరోగా ఇప్పుడు శ్రీవిష్ణు నిలిచిపోయాడు.

By:  Tupaki Desk   |   18 July 2023 3:48 AM GMT
యూఎస్ లో శ్రీవిష్ణు బిగ్గెస్ట్ రికార్డ్
X

యంగ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సైడ్ క్యారెక్టర్స్ తో కెరియర్ స్టార్ట్ చేసిన శ్రీవిష్ణు ప్రేమ ఇష్క్ కాదల్ సినిమా తో హీరోగా మారాడు. తరువాత చాలా కాలం పాటు సైడ్ రోల్స్ లోనే చేసేవాడు. నారా రోహిత్ అప్పట్లో ఒకడుండేవాడు మూవీతో మళ్ళీ హీరో గా తన స్టామినా చూపించాడు. మా అబ్బాయ్ అనే సినిమా తో సోలో హీరోగా మారాడు.


ఆ మూవీ డిజాస్టర్ అయిన మెంటల్ మది లో, నీది నాది ఒకటే కథ, బ్రోచేవారెవరురా సినిమా లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా శ్రీవిష్ణు లోని కామెడీ టైమింగ్ ప్రేక్షకుల కి భాగా కనెక్ట్ అయ్యింది. తాజాగా సామజవరగమన మూవీతో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ కథతో ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతా లో వేసుకున్నాడు.

ఇప్పటి వరకు శ్రీవిష్ణు కెరియర్ లో వచ్చిన అతిపెద్ద హిట్ ఇదే అని చెప్పాలి. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామా ప్రేక్షకులకి భాగా కనెక్ట్ అయ్యింది. అందులో 40 కోట్లకి పైగా గ్రాస్ ని ఇప్పటి వరకు కలెక్ట్ చేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ఓవర్సీస్ మార్కెట్ లో కూడా వన్ మిలియన్ క్లబ్ లో చేరింది.

చిన్న హీరోల లో వన్ మిలియన్ కి పైగా కలెక్షన్స్ ని ఓవర్సీస్ మార్కెట్ లో సాధించిన హీరోగా ఇప్పుడు శ్రీవిష్ణు నిలిచిపోయాడు. రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాతగా అతనికి కూడా సామజవరగమన అతి పెద్ద హిట్ అని చెప్పొచ్చు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణ లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. రివ్యూలు నెగిటివ్ గా రాసిన కూడా అల్లు అర్జున్, రవితేజ లాంటి స్టార్స్ మూవీ అద్భుతంగా ఉందని ట్వీట్ చేశారు.

ఇవి జనాల్లోకి వెళ్ళాయి. అలాగే మౌత్ టాక్ తో ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం మొదలు పెట్టారు. మొదటి రోజు కంటే 10వ రోజు కలెక్షన్స్ అధికంగా వచ్చాయంటే సినిమాకి ఏ స్థాయిలో ఆదరణ లభించిందో అర్ధం చేసుకోవచ్చు.