Begin typing your search above and press return to search.

స్వాగ్‌తో అది కావాల్సినంత వచ్చింది..!

ఇంటర్వ్యూలో శ్రీవిష్ణు మాట్లాడుతూ... స్వాగ్‌ సినిమా విషయంలో అసంతృప్తి లేదు. వంద కోట్ల బ డ్జెట్‌ పెట్టి తీసినా రానంత పేరును స్వాగ్ సినిమాతో దక్కించుకున్నాను.

By:  Tupaki Desk   |   5 May 2025 12:30 PM
Sri Vishnu Clarifies on ‘Single’ Movie Controversy
X

శ్రీవిష్ణు హీరోగా వచ్చిన స్వాగ్ సినిమా విభిన్నమైన కామెడీ ఎంటర్‌టైనర్‌గా నిలిచిన విషయం తెల్సిందే. సినిమాకు మంచి స్పందన వచ్చింది. కానీ థియేట్రికల్‌ రిలీజ్ సమయంలో వసూళ్లు ఆశించిన స్థాయిలో రాలేదు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా శ్రీ విష్ణు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్వాగ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్వాగ్‌ సినిమా విషయంలో తాను రిగ్రెట్‌ ఫీల్ అవుతున్నట్లు కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ నాకు ఆ సినిమా చాలా సంతృప్తిని కలిగించింది. తన కెరీర్‌లో ఒక బెస్ట్‌ సినిమాగా స్వాగ్‌ను నేను ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాను. ఆ సినిమా థియేట్రికల్‌ రిలీజ్‌తో నిరాశ పరచినా ఓటీటీ స్ట్రీమింగ్‌తో సంతృప్తి పరచిందని అన్నాడు.

శ్రీవిష్ణు హీరోగా నటించిన సింగిల్ సినిమా విడుదలకు సిద్ధం అయింది. ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శ్రీ విష్ణు మీడియాతో మాట్లాడుతూ స్వాగ్ సినిమా గురించి స్పందించాడు. సింగిల్ సినిమా వివాదం గురించి కూడా ఆయన మాట్లాడాడు. తన సినిమాల్లో ఎప్పుడూ కూడా హద్దు దాటి అశ్లీలం ఉండదని, అంతే కాకుండా ఎప్పుడూ ఒకరిని ఉద్దేశించి విమర్శలు చేయను అన్నాడు. సింగిల్‌ సినిమాలోనే కాకుండా అంతకు ముందు చేసిన ఏ సినిమాలో కూడా తాను అడల్ట్‌ కంటెంట్‌ను ప్రోత్సహించలేదు అన్నాడు. స్వాగ్‌ సినిమా కోసం చాలా కష్టపడ్డట్లు చెప్పుకొచ్చిన శ్రీ విష్ణు ఆ సినిమా చాలా సంతృప్తిని ఇచ్చిందన్నాడు.

ఇంటర్వ్యూలో శ్రీవిష్ణు మాట్లాడుతూ... స్వాగ్‌ సినిమా విషయంలో అసంతృప్తి లేదు. వంద కోట్ల బ డ్జెట్‌ పెట్టి తీసినా రానంత పేరును స్వాగ్ సినిమాతో దక్కించుకున్నాను. ఓటీటీలో స్వాగ్‌ సినిమాను తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఇతర భాషల ప్రేక్షకులు చూశారు. ఆ విషయాన్ని చాలా మంది చెబుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. స్వాగ్‌ సినిమా థియేట్రికల్‌ రిలీజ్ అయిన సమయంలో నిర్మాత విశ్వ ప్రసాద్‌ గారికి డబ్బులు ఇంకాస్త ఎక్కువ వచ్చి ఉంటే బాగుండేది. ఆ ఒక్క విషయం తప్ప స్వాగ్‌ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. తాను ఒక సినిమాను చేసిన సమయంలో డబ్బుల కంటే ఎక్కువగా పేరు వస్తుందా అని చూస్తాను. స్వాగ్‌ సినిమాతో ఆ పేరు కావాల్సినంత వచ్చింది.

ఇక సింగిల్ సినిమా విషయానికి వస్తే చాలా విభిన్నమైన కంటెంట్‌ అని ట్రైలర్‌ ను చూస్తే అర్థం అవుతోంది. చాలా సినిమాల్లోని ఫేమస్ డైలాగ్స్‌, మీమ్స్ డైలాగ్స్, వైరల్‌ కంటెంట్‌ను వాడినట్లుగా ట్రైలర్‌ను చూస్తే అర్థం అవుతోంది. సోషల్‌ మీడియాలో సినిమాకు మంచి రీచ్ వచ్చింది. స్వాగ్‌ సినిమా ట్రైలర్‌ విడుదల తర్వాత మంచు విష్ణు కన్నప్ప డైలాగ్‌కు సంబంధించి విమర్శలు వచ్చాయి. దాంతో శ్రీ విష్ణు వెంటనే స్పందించాడు. ఆ డైలాగ్‌ను తొలగిండచంతో పాటు సినిమాలో కూడా ఇకపై ఉండదని విష్ణు క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ జోరుగా జరుగుతున్నాయి. పోటీ పెద్దగా లేకపోవడంతో కచ్చితంగా స్వాగ్‌ సినిమా మంచి ఓపెనింగ్స్ను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.