నవ్వుల రారాజు 'శ్రీవిష్ణు'.. సరిగ్గా సరిపోతుంది కదా!
ఇప్పుడు శ్రీ విష్ణు విషయంలో అదే జరిగింది. రీసెంట్ మూవీ సింగిల్ కు గాను ఆయనను కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ గా మేకర్స్ పరిచయం చేసి సందడి చేశారు.
By: Tupaki Desk | 10 May 2025 4:57 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు.. ఈయనకు ఉన్న క్రేజే వేరు. స్పెషల్ ఫ్యాన్ బేస్ కుర్రాడు సొంతం. నటించిన సినిమా వస్తుందంటే చాలు.. మినిమమ్ గ్యారంటీ అని ఫిక్స్ అవుతారు ఆడియన్స్. అలా తన టాలెంట్ తో ఓ రేంజ్ లో గుర్తింపు సంపాదించుకున్నారు శ్రీవిష్ణు. టాలెంటెడ్ హీరోల లిస్ట్ లో కచ్చితంగా టాప్ లోనే ఉంటారు!
ప్రతి సినిమాలో ఆయన మార్క్ ను చూపిస్తారు. కామెడీ టైమింగ్ తో అలరిస్తారు. వన్ లైనర్స్, డైలాగ్స్ లో ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్విస్తారు. అడల్ట్ జోక్స్ వేసినా ఎవరినీ నొప్పించరు. అవేంటో తెలియకుండానే డైలాగ్స్ లో కలిపేస్తారు. స్టార్ హీరోల డైలాగ్స్ ను తనదైన శైలిలో ఇమిటేట్ చేస్తారు. కొన్ని వైరల్ స్టెప్పులను కూడా వేస్తారు.
వాటికి సినీ ప్రియులు ఇట్టే అట్రాక్ట్ అయ్యేలా చేస్తారు. అలా ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో అందరినీ ఆకట్టుకుంటారు. సామజవరగమన, ఓం భీమ్ బుష్, స్వాగ్.. ఇప్పుడు సింగిల్ చిత్రాల్లో వినోదాన్ని పంచుతున్నారు. అలాంటి శ్రీవిష్ణుకు కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనే ట్యాగ్ ఇస్తే ఎలా ఉంటుంది? కరెక్ట్ గా సెట్ అవుతుంది కదా..
ఇప్పుడు అదే జరిగింది. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోల పేర్ల ముందుకు ట్యాగ్ ఉండడం కామన్. కానీ అది సదరు హీరోకు సెట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు శ్రీ విష్ణు విషయంలో అదే జరిగింది. రీసెంట్ మూవీ సింగిల్ కు గాను ఆయనను కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ గా మేకర్స్ పరిచయం చేసి సందడి చేశారు.
అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆయన ట్యాగ్ కోసం చర్చ జరుగుతోంది. సరైన్ ట్యాగ్ ఇచ్చారని సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. ఆప్ట్ గా సెట్ అయిందని అంటున్నారు. వినోదాల రారాజు మన శ్రీవిష్ణు అంటూ ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు నెటిజన్లు.
అయితే సింగిల్ మూవీపై రిలీజ్ కు ముందే పాజిటివ్ బజ్ నెలకొంది. ట్రైలర్ లోని ఆయన వేసిన పంచ్ డైలాగ్స్ కు అంతా అట్రాక్ట్ అయ్యారు. ఇప్పుడు మూవీ రిలీజ్ అయ్యాక ఆయన యాక్టింగ్, కామెడీ టైమింగ్ తో మరోసారి అదరగొట్టేశారని చెబుతున్నారు. వెన్నెల కిషోర్ తో ఉన్న సీన్స్ సూపర్ అని అంటున్నారు. థియేటర్లలో నవ్వులే నవ్వులు అని కామెంట్స్ పెడుతున్నారు.
