Begin typing your search above and press return to search.

శ్రీవల్లి 2.0 అంతకు మించి...!

కానీ తాజాగా చిత్ర యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న లీక్ అనుసారం పుష్ప 2 లో శ్రీవల్లి పాత్ర కు చాలా ప్రాముఖ్యత ఉంటుందట.

By:  Tupaki Desk   |   23 Feb 2024 5:56 AM GMT
శ్రీవల్లి 2.0 అంతకు మించి...!
X

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. మొదటి పార్ట్ లో నటనకు గాను అల్లు అర్జున్ జాతీయ అవార్డును సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. పుష్ప 2 లో అల్లు అర్జున్ అంతకు మించి అన్నట్లుగా నటిస్తున్నాడని, ఆయన పాత్రను అద్భుతంగా దర్శకుడు సుకుమార్‌ డ ఇజైన్ చేశాడని వార్తలు వస్తున్నాయి.

ఇన్ని రోజులుగా హీరోయిన్ శ్రీవల్లి పాత్ర గురించి పెద్దగా చర్చ జరగలేదు. కానీ తాజాగా చిత్ర యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న లీక్ అనుసారం పుష్ప 2 లో శ్రీవల్లి పాత్ర కు చాలా ప్రాముఖ్యత ఉంటుందట. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర లో ఆమె కనిపించబోతుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

మొదటి పార్ట్‌ లో కేవలం గ్లామర్ రోల్‌ కే పరిమితం అయ్యింది. అయితే రెండో పార్ట్‌ లో గర్భవతిగా కనిపించబోతుందని, తల్లి సెంటిమెంట్‌ సన్నివేశాల్లో కూడా ఆమె కనిపించబోతుందనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి శ్రీవల్లి ని మొదటి పార్ట్‌ తో పోల్చితే అంతకు మించి అన్నట్లుగా పుష్ప 2 లో ఉండబోతుందట.

యానిమల్ సినిమాలో రష్మిక మందన్న పాత్ర కు మంచి మార్కులు దక్కాయి. ఆ సినిమాలో రష్మిక నటన విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అందుకే దర్శకుడు సుకుమార్‌ పుష్ప 2 లో కూడా ఆమె నటనతో ప్రేక్షకులను సర్‌ ప్రైజ్ చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి.

రష్మిక మందన్న ఈ మధ్య కాలంలో వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ లతో బిజీ అవుతోంది. పుష్ప తో పాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకున్న రష్మిక పుష్ప 2 తో మరింతగా స్టార్ డమ్‌ దక్కించుకోవడం ఖాయం. పుష్ప 2 సూపర్ హిట్‌ అయితే రష్మిక తన పారితోషికంను భారీగా పెంచే అవకాశాలు ఉన్నాయి.