Begin typing your search above and press return to search.

పుష్ప - 2 లో శ్రీవల్లి కాదు...!

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

By:  Tupaki Desk   |   15 April 2024 9:23 AM GMT
పుష్ప - 2 లో శ్రీవల్లి కాదు...!
X

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన పుష్ప 1 సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా సీక్వెల్‌ పై అంచనాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి.

షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతుంది. ఇలాంటి సమయంలో హీరోయిన్‌ గా నటిస్తున్న రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఒక కార్యక్రమంలో రష్మిక మందన్న మాట్లాడుతూ పుష్ప 2 లోని తన పాత్ర గురించి, సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయమై కామెంట్స్ చేసింది.

రష్మిక మందన్న మాట్లాడుతూ... పుష్ప మొదటి పార్ట్‌ ను మొదలు పెట్టిన సమయంలో తాము ఎలాంటి ప్రపంచం ను క్రియేట్‌ చేయబోతున్నాం.. అందులో పాత్రలు ఎలా ఉంటాయి, వాటికి ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుంది అనేది తెలియదు. కానీ పుష్ప 2 విషయంలో అలా కాదు.

ఇప్పుడు పుష్ప 2 లో ప్రతి పాత్ర ను దర్శకుడు అద్భుతంగా చూపించేందుకు దర్శకుడు సుకుమార్‌ కసరత్తు చేస్తున్నారు. పుష్ప లో నా పాత్ర శ్రీవల్లి. అయితే ఈ సినిమాలో కొత్త శ్రీవల్లి ఉంటుంది. పుష్ప మొదటి పార్ట్‌ శ్రీవల్లి కి పుష్ప 2 శ్రీవల్లికి పూర్తి తేడా ను ప్రేక్షకులు చూడబోతున్నారు అంటూ రష్మిక కామెంట్స్‌ చేసింది.

మొత్తానికి సినిమా స్థాయి అంతకంతకు పెంచే విధంగా యూనిట్ సభ్యులు ఏదో ఒక వ్యాఖ్య చేస్తూనే వస్తున్నారు. ఇప్పుడు శ్రీవల్లి వంతు వచ్చింది. ఆగస్టు వరకు ఇదే హైప్‌ ను క్రియేట్‌ చేస్తూ ఇంకాస్త ఆసక్తిని పెంచగలిగితే మాత్రం ఓపెనింగ్స్ రికార్డ్‌ బ్రేక్ చేయడం ఖాయం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.