Begin typing your search above and press return to search.

ఆ సినిమా ఫ‌లితంపై యంగ్ హీరో కెరీర్!

ఇప్ప‌టివర‌కూ నేను చేసిన‌వ‌న్నీ క‌థా బ‌లం ఉన్న చిత్రాలే. 'ఉస్తాద్' ఫ‌లితాన్ని బ‌ట్టి త‌దుప‌రి సినిమాల్ని నిర్ణ‌యిస్తా.

By:  Tupaki Desk   |   12 Aug 2023 4:22 AM GMT
ఆ సినిమా ఫ‌లితంపై యంగ్ హీరో కెరీర్!
X

సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి త‌న‌యుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన శ్రీ సింహ సుప‌రిచితుడే. 'మ‌త్తువ‌ద లరా' సినిమాతో లాంచ్ అయ్యాడు. అటుపై 'తెల్ల‌వారితే గురువారం'.. 'దొంగ‌లున్నారు జాగ్ర‌త్త‌'.. 'భాగ్ సాలే' లాంటి సినిమాల్లో న‌టించాడు. అయితే ఇవేవి శ్రీసింహ ఆశించిన స్థాయిలో స‌క్సెస్ అవ్వ‌లేదు. కానీ న‌టుడిగా అవ‌కాశాలు అందుకుంటున్నాడు. త‌న సొంత ట్యాలెంట్ లో సాధిస్తున్నాడా? వెనుక బ్యాక్ గ్రౌండ్ తో సాధ్య‌మ‌వుతుందా? అన్న‌ది ప‌క్క‌న‌బెడితే నిరూపించుకోవాలి అన్న క‌సి ప‌ట్టుద‌ల యంగ్ హీరోలో క‌నిపిస్తుంది.

ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఓ ఐడెంటిటీ రావాల‌ని శ్ర‌మిస్తున్నాడు. తాజాగా 'ఉస్తాద్' సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఈ సంద‌ర్భంగా కెరీర్ జ‌ర్నీని ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసాడు. 'నా చిత్రాల విష‌యంలో తొలి విమ‌ర్శ‌కులు నా కుటుంబ స‌భ్యులే. బాబాయ్ రాజ‌మౌళి గానీ..నాన్న గానీ సినిమా చూశాక అందులో త‌ప్పుల్ని విశ్లేషించి చెబుతారు. ఇప్ప‌టివర‌కూ నేను చేసిన‌వ‌న్నీ క‌థా బ‌లం ఉన్న చిత్రాలే. 'ఉస్తాద్' ఫ‌లితాన్ని బ‌ట్టి త‌దుప‌రి సినిమాల్ని నిర్ణ‌యిస్తా.

'మ‌త్తువ‌ద‌ల‌రా'కి సీక్వెల్ చేయాల‌ని ఉంది. కానీ అది ఎప్పుడు జ‌రుగుతుందో చెప్ప‌లేను' అని అన్నారు. దీంతో శ్రీసింహ‌కి స‌క్సెస్ అనివార్య‌మ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం యంగ్ హీరో చేతిలో ఈ ఒక్క సినిమానే ఉంది. మ‌రే కొత్త ప్రాజెక్ట్ ఏది చ‌ర్చ‌లో ద‌శ‌లో ఉన్న‌ట్లు రివీల్ చేయ‌లేదు. ప‌రిశ్ర‌మ‌లో విజ‌యం మాత్ర‌మే నిల‌బెడ‌తుంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్నా విజ‌యాలు లేక‌పోతే అవ‌కాశాలు క‌ష్టంగానే మారుతాయి. అందుకు ఎంతో మందిని ఉద‌హ రించవ‌చ్చు. ఇక్క‌డ ట్యాలెంట్ తో పాటు ల‌క్ కూడా క‌లిసి రావాలి.

మ‌రి శ్రీసింహ జ‌ర్నీ ఎలా ఉంటుందో చూడాలి. అలాగే మ‌హేష్‌-రాజ‌మౌళి ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ విష‌యం రివీల్ చేసారు. అన్ని మార్కెట్ల‌ను ట‌చ్ చేసేలా సినిమా ఉంటుంద‌ని.. మ‌హేష్ ని కొత్త‌గా ప్ర‌జెంట్ చేయ‌బోతున్నట్లు తెలిపారు.