Begin typing your search above and press return to search.

సుహాస్ శ్రీరంగ నీతులు.. రిలీజ్ ఎప్పుడంటే?

ఏప్రిల్ 12న ప్ర‌పంచ‌ వ్యాప్తంగా శ్రీ‌రంగ‌నీతులు మూవీని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాలో సీనియర్ నటుడు తనికెళ్ల భరణి కీలకపాత్ర పోషిస్తున్నారు.

By:  Tupaki Desk   |   8 March 2024 1:39 PM GMT
సుహాస్ శ్రీరంగ నీతులు.. రిలీజ్ ఎప్పుడంటే?
X

శ్రీ‌రంగ‌నీతులు.. ఈ పదం తెలుగు ప్రజలకు బాగా పరిచయమే. ఇప్పుడే ఇదే టైటిల్ తో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ యంగ్ యాక్టర్లు సుహాస్‌, కార్తీక్‌ ర‌త్నం, రుహానీ శ‌ర్మ‌, విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ప్ర‌వీణ్‌ కుమార్ వీఎస్ ఎస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండగా.. రాధావి ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫ‌స్ట్ లుక్‌తో పాటు టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ ల‌భించింది. విన‌రా విన‌రా చెబుతా విన‌రా ఈ కాలం శ్రీ‌రంగ‌నీతులు అంటూ సాగే టైటిల్ సాంగ్‌ కూడా ఆకట్టుకుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. శివరాత్రి కానుకగా తాజాగా మేకర్స్ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు.

ఏప్రిల్ 12న ప్ర‌పంచ‌ వ్యాప్తంగా శ్రీ‌రంగ‌నీతులు మూవీని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాలో సీనియర్ నటుడు తనికెళ్ల భరణి కీలకపాత్ర పోషిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్, అజయ్ అరసాడ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం జనరేషన్ కు ఈ సినిమా ఆకట్టుకుంటుందని ఇప్పటికే మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే ప్రమోషన్లను షురూ చేయనున్నారు.

తాజాగా దర్శకుడు ప్రవీణ్ కుమార్ సినిమా గురించి మాట్లాడారు. "సినిమాలోని పాత్ర‌ల‌తో ప్రస్తుత యువతరం త‌మ‌ను తాము ఐడెంటిఫై చేసుకునే క‌థ‌ల‌తో, న్యాచరల్ సాగే మాట‌లతో, మ‌న‌సుకు హ‌త్తుకునే స‌న్నివేశాల‌తో వ‌చ్చే మూవీలు చాలా అరుదుగా ఉంటాయి. మా సినిమా ఈ కోవ‌లోనే చేరుతుంది. ఇటీవ‌ల విడుద‌లైన మా టీజ‌ర్‌కు, టైటిల్ సాంగ్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది" అని చెప్పారు.

యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న శ్రీరంగనీతులు చిత్రంలో ఆస‌క్తిక‌ర‌మైన కథ‌ మ‌న‌సుకు హ‌త్తుకుంటుందని ప్రవీణ్ కుమార్ తెలిపారు. కొత్త‌ద‌నంతో పాటు పూర్తి క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో రూపొందించిన చిత్ర‌మని చెప్పారు. తప్పకుండా శ్రీరంగనీతులు మూవీ అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉందని నిర్మాత తెలిపారు. ఏప్రిల్ 12వ తేదీన విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. మరి సుహాస్ ఈ మూవీతో మరో హిట్ కొడతారో లేదో చూడాలి.