Begin typing your search above and press return to search.

హనుమాన్.. శ్రీరామ దూత స్తోత్రం విన్నారా?

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా హనుమాన్ సినిమా వస్తున్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   3 Jan 2024 5:07 AM GMT
హనుమాన్.. శ్రీరామ దూత స్తోత్రం విన్నారా?
X

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా హనుమాన్ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రం.. ప్రమోషనల్ కంటెంట్ తో సినీ ప్రియుల్లో భారీ హైప్ క్రియేట్ చేసింది. యువ కథానాయకుడు తేజ సజ్జ నటించిన ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ తోపాటు ట్రైలర్.. ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేశాయి.


తాజాగా ఈ సినిమా నుంచి శ్రీరామ దూత స్తోత్రం లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. "రం రం రం రక్త వర్ణం.. దినకర వదనం.. తీక్షద్రష్టం కరాళం.. రం రం రం రమ్యతేజం" అంటూ సాగిన ఈ పాట గూస్ బంప్స్ తెప్పిస్తోందని నెటిజన్లు చెబుతున్నారు. సినిమాపై ఒక్కసారిగా మరిన్ని అంచనాలు పెరిగాయని అంటున్నారు. వీఎఫ్ఎక్స్ షాట్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని సాంగ్ ను రీషేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ వైరల్ గా మారింది.

గౌరహరి మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ కు సాయి చరణ్ భాస్కరుణి, లోకేశ్వర్ ఈదర, హర్షవర్ధన్ చావలి తమ గాత్రంతో ప్రాణం పోశారు. సాంగ్ లో విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయి. హనుమంతుడి దైవిక శక్తిని అద్భుతంగా ప్రతిబింబిస్తున్నాయి. హై క్వాలిటీ యూనిమేషన్ తో ప్రశాంత్ వర్మ ఔరా అనిపిస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి ప్రశాంత్ వర్మ తన మార్క్ చూపించనున్నారని ఫ్యాన్స్ అంటున్నారు.

ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. వాన ఫేమ్ విన‌య్ రాయ్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ కానుంది. శ్రీలంక, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, స్పెయిన్, జర్మనీ.. ఇలా అనేక కంట్రీస్ లో మొత్తం 11 భాషల్లో విడుదల కానుంది. .

జనవరి 12న గుంటూరు కారం సినిమాతోనే పాటే హనుమాన్ కూడా రిలీజ్ అవుతుండటం విశేషం. సంక్రాంతికి రిలీజ్ కానున్న సినిమాల్లో ఎక్కువ మంది చూడటానికి ఆసక్తి చూపిస్తున్న జాబితాలో హనుమాన్ సెకండ్ ప్లేస్ లో ఉంది. ఈ మూవీ హిట్ అయితే ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్న సూపర్ హీరోల యానివర్స్ మంచి ఆరంభం దొరికినట్లు అవుతుంది. మరేం జరుగుతుందో చూడాలి.