Begin typing your search above and press return to search.

'మనమే'లో 16 సాంగ్స్.. రీజన్ ఇదే..

కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా.. లండన్ బ్యాక్ డ్రాప్ లో మూవీ రూపొందింది.

By:  Tupaki Desk   |   7 Jun 2024 6:29 AM GMT
మనమేలో 16 సాంగ్స్.. రీజన్ ఇదే..
X

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య.. శర్వానంద్ హీరోగా మనమే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఫీల్ గుడ్ జానర్ లో రూపొందిన ఈ సినిమా.. నేడే థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. మంచి టాక్ దక్కించుకుని దూసుకుపోతోంది. మూవీ బాగుందని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా.. లండన్ బ్యాక్ డ్రాప్ లో మూవీ రూపొందింది.

అయితే శ్రీరామ్ ఆదిత్య ఇప్పటి వరకు నాలుగు సినిమాలు తెరకెక్కించగా.. అన్నీ క్రైమ్ కామెడీలే. ఇప్పుడు ఫీల్ గుడ్ జానర్ లో రిలేషన్ షిప్ డ్రామాగా మనమే చిత్రాన్ని రూపొందించారు. దీంతోపాటు ఈ సినిమాలో 16 పాటలు ఉన్నట్లు ఇటీవల చెప్పి సర్ప్రైజ్ ఇచ్చారు. దీంతో ఈ విషయం ఆ మధ్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఈ రెండు విషయాలపై రీసెంట్ గా ఓ మీడియా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు శ్రీరామ్ ఆదిత్య.

తనకు ఫీల్ గుడ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్లు అంటే చాలా ఇష్టమని తెలిపారు శ్రీరామ్ ఆదిత్య. 1991లో వచ్చిన సీతారామయ్య గారి మనవరాలు, 2002లో విడుదలైన మన్మధుడు తన ఫేవరెట్ సినిమాలుగా చెప్పారు. అలాంటి సినిమా ఎప్పటి నుంచో తీయాలనేది తన డ్రీమ్ అని అన్నారు. అందుకే మనమే చిత్రం చేసినట్లు వెల్లడించారు. దీంతోపాటు సినిమాలో 16 పాటల విషయంపై కూడా క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య.

"మనమే సినిమాకు మలయాళం కంపోజర్‌ హేశమ్‌ అబ్దుల్ వహబ్ సంగీతం అందించారు. సినిమాలో ఎక్కువ పాటలు ఉంటే ఫోకస్ మిస్ అవుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ మా మూవీ విషయంలో అది రివర్స్. ఒక్క పాట కూడా బోర్ కొట్టదు. సినిమాలోని కొన్ని సీన్స్ కు ఎలివేషన్లు ఇవ్వడానికి సాంగ్స్ ను జాగ్రత్తగా ఉపయోగించాం. కొన్ని పెద్దగా.. మరికొన్ని చిన్నగా ఉంటాయి" అని శ్రీరామ్ ఆదిత్య తెలిపారు.

ఇక ఈ సినిమాలో ఓ పిల్లవాడు హైలెట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ బాలుడు తన కుమారుడు విక్రమ్ ఆదిత్యనేని మరోసారి తెలిపారు శ్రీరామ్. "సినిమా స్టార్ట్ చేసినప్పుడు వాడికి రెండున్నరేళ్లు. ఇప్పుడు మూడున్నరేళ్లు. సినిమాలో నటిస్తున్నట్లు అతడికి తెలియదు. కానీ సెట్స్ లో అందరితో హ్యాపీగా గడిపాడు. ఎలాంటి ఇబ్బంది రాలేదు" అని చెప్పారు. మరి ఆ చిట్టి బాలుడు నటించిన మనమే చిత్రాన్ని మీరు థియేటర్లలో చూశారా లేదా?