జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన హీరో
పోలీసుల విచారణ సమయంలో శ్రీరామ్ తన తప్పును అంగీకరించాడు. డ్ర*గ్స్‌ను తీసుకున్నట్లు అతడు స్వయంగా ఒప్పుకున్నట్లు పోలీసులు తెలియజేశారు.
By: Tupaki Desk | 11 July 2025 1:08 PM ISTసినిమా ఇండస్ట్రీలో డ్ర*గ్స్ వాడకం ఉంటుందని గత నెలలో మరోసారి నిరూపితం అయింది. తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు డ్ర*గ్స్ వాడుతున్నట్లు అనుమానించి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. డ్ర*గ్స్ తో దొరికిన వారిలో హీరో శ్రీరామ్ సైతం ఉన్నాడు. తమిళ్‌లో శ్రీకాంత్ అంటూ పిలిచే ఇతడిని తెలుగు ప్రేక్షకులు శ్రీరాం అంటారు. తెలుగు, తమిళ్‌లో ఎన్నో సినిమాల్లో నటించిన ఇతడు డ్ర*గ్స్ వాడుతున్నట్లు గుర్తించి గత నెల 23వ తేదీన తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. పుళల్ జైలుకు తరలించారు. పోలీసుల విచారణ సమయంలో శ్రీరామ్ తన తప్పును అంగీకరించాడు. డ్ర*గ్స్‌ను తీసుకున్నట్లు అతడు స్వయంగా ఒప్పుకున్నట్లు పోలీసులు తెలియజేశారు.
శ్రీరామ్ అరెస్ట్ అయిన మూడు రోజులకు మరో తమిళ నటుడు కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశాడు. అతడు సైతం తన తప్పును ఒప్పుకుని, డ్ర*గ్స్‌ను వినియోగించినట్లు పేర్కొన్నాడు. వీరిద్దరికీ మొదట కోర్ట్ బెయిల్ నిరాకరించింది. దాంతో గత రెండు వారాలుగా వీరిద్దరూ జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఎట్టకేలకు తన కొడుకును చూడాలని, అతడు తనపై బెంగ పెట్టుకున్నాడని కోర్టుకు విన్నవించి శ్రీరామ్ బెయిల్ దక్కించుకున్నాడు. డ్రగ్స్ వాడుతున్నట్లు ఒప్పుకోవడంతో పాటు, విచారణకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తాను అంటూ హామీ ఇవ్వడంతో కోర్ట్ శ్రీరామ్ తో పాటు కృష్ణకు కండీషన్స్‌తో కూడిన బెయిల్‌ను మంజూరు చేయడంతో వారిద్దరూ బయటకు వచ్చారు.
విచారణలో భాగంగా శ్రీరామ్ తనకు డ్ర*గ్స్ అలవాటు చేసిన వారు ఎవరు, ఆ తర్వాత జరిగిన పరిస్థితుల గురించి చెప్పుకొచ్చాడు. కొన్ని సంవత్సరాల క్రితం అన్నాడీఎంకే మాజీ నేత ప్రసాద్ నిర్మాణ సంస్థలో నేను ఒక సినిమాను చేశాను. ఆ సినిమా పూర్తి అయిన తర్వాత ఆయన నాకు రూ.10 లక్షలు ఇవ్వాల్సి ఉంది. ఆ డబ్బు కోసం అడిగిన ప్రతి సారి అదుగో ఇదుగో అంటూ దాట వేస్తూ వచ్చాడు. ఒకసారి ఆ డబ్బు అడిగిన సమయంలో డ్ర*గ్స్ ఇచ్చాడు. త్వరలో ఇస్తాను, ఇది ఉండనివ్వండి అన్నాడు. రెండు సార్లు అలా చేశాడు. మూడో సారి నేనే ఆ డ్ర*గ్స్‌ను అడిగేలా చేశాడు అన్నాడు. శ్రీరామ్‌కు డ్ర*గ్స్ సరఫరా చేసిన ఆ అన్నాడీఎంకే మాజీ నేతను పోలీసులు విచారిస్తున్నారు.
తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాలతో పాపులారిటీని సొంతం చేసుకున్న శ్రీరామ్ తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేశాడు. కానీ చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం నిరాశ పరచడంతో కెరీర్ చాలా తక్కువ సమయంలోనే కనుమరుగు అయింది. ఆఫర్లు అనేవి రాకుండా పోయాయి. ఇప్పుడు డ్ర*గ్స్ కేసులో పట్టుబడటంతో శ్రీరామ్‌కి కెరీర్ ఖతం అయినట్లే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. శ్రీరామ్ కనీసం మొన్నటి వరకు తమిళ్‌లో అయినా చిన్నా చితకా సినిమాలు చేస్తూ ఉండేవాడు. కానీ ఇప్పుడు అది కూడా పోయింది. ముందు ముందు అతడు కెరీర్ మరింత గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావచ్చు అంటున్నారు. డ్ర*గ్స్ వాడినట్లుగా ఒప్పుకున్న శ్రీరామ్ ముందు ముందు వాటికి పూర్తిగా దూరంగా ఉండటం మంచిది. కొన్నాళ్లు బ్రేక్ తీసుకుని శ్రీరామ్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.
