Begin typing your search above and press return to search.

అజిత్ తో సినిమా మిస్సైన శ్రీను వైట్ల..!

తెలుగు దర్శకులు తమిళ హీరోలను డైరెక్ట్ చేయడం కొత్తేమి కాదు. అయితే అజిత్ ని డైరెక్ట్ చేసే అవకాశం మిస్ చేసుకున్నారట ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల.

By:  Tupaki Desk   |   21 Sep 2023 11:02 AM GMT
అజిత్ తో సినిమా మిస్సైన శ్రీను వైట్ల..!
X

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. తమిళంలోనే కాదు తెలుగులో కూడా అజిత్ కు ఫ్యాన్స్ ఉన్నారు. కోలీవుడ్ లో అజిత్ చేసే సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. తన ప్రతి సినిమాతో ఫ్యాన్స్ ని అలరిస్తున్న అజిత్ డిఫరెంట్ కథలతో వస్తుంటారు. తెలుగు దర్శకులు తమిళ హీరోలను డైరెక్ట్ చేయడం కొత్తేమి కాదు. అయితే అజిత్ ని డైరెక్ట్ చేసే అవకాశం మిస్ చేసుకున్నారట ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల.

సూపర్ స్టార్ మహేష్ తో దూకుడుతో శ్రీను వైట్ల అందుకున్న సక్సెస్ ఏంటో తెలిసిందే. టాలీవుడ్ స్టార్స్ ని డైరెక్ట్ చేసిన శ్రీను వైట్ల అజిత్ ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిందట. ఒకసారి అజిత్ ని కలిసినప్పుడు ఆయన దూకుడు సినిమా చూసి బాగా నచ్చిందని అన్నారట. కుదిరితే దాన్ని తమిళంలో రీమేక్ చేద్దామని అన్నారట. అయితే అజిత్ దూకుడు రీమేక్ కు రెడీ అని చెప్పినా ఆ టైం లో శ్రీను వైట్ల ఎన్.టి.ఆర్ తో బాద్షా సినిమా చేస్తుండటం వల్ల ఆ ఛాన్స్ వదులుకున్నారట.

అయితే శ్రీను వైట్ల కాదనే సరికి అజిత్ కూడా దూకుడు రీమేక్ ని లైట్ తీసుకున్నారట. ఏదైనా సినిమా ఒక భాషలో హిట్ అయితే ఆ డైరెక్టర్ అయితేనే ఏ భాషలో రీమేక్ చేసినా సరే న్యాయం చేస్తాడన్న నమ్మకం ఉంటుంది. అందుకే తెలుగులో కొన్ని తమిళ సినిమాలు రీమేక్ అయినా కూడా మాతృక దర్శకుడితోనే డైరెక్ట్ చేయిస్తారు.

శ్రీను వైట్ల ఆ టైం లో ఫ్రీగా ఉండి ఉంటే అజిత్ సినిమా తన ఖాతాలో పడి ఉండేది. తమిళ దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు కానీ తెలుగు దర్శకులు తెలుగు మార్కెట్ దాటి బయటకు వెళ్లరు. ఎవరో ఒకరిద్దరు తప్ప ఇక్కడ సినిమాలు ఇక్కడ హీరోలతోనే సినిమాలు చేస్తుంటారు. అయితే ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ ని శాసిస్తున్న టాలీవుడ్ లో వెరైటీ కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి. మరి ఈ క్రమంలో మళ్లీ శ్రీను వైట్లకి అజిత్ ని డైరెక్ట్ చేసే అవకాశం వస్తుందేమో చూడాలి.

ఈమధ్య కెరీర్ పరంగా ఏమాత్రం ఫాం లో లేని శ్రీను వైట్ల రీసెంట్ గా గోపీచంద్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నారు.