శ్రీనువైట్ల మరీ అంత పిసినారి కాదు!
ఒకప్పుడు శ్రీనువైట్ల డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. `వెంకీ`, `ఢీ`, `రెడీ`, `దూకుడు` లాంటి ఎన్నో హిట్ సినిమాలందించారు.
By: Tupaki Desk | 9 Jun 2025 9:00 AM ISTఒకప్పుడు శ్రీనువైట్ల డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. `వెంకీ`, `ఢీ`, `రెడీ`, `దూకుడు` లాంటి ఎన్నో హిట్ సినిమాలందించారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలకు హిట్ సినిమా లు అందించిన ఘనత ఆయన సొంతం. అయితే కొంత కాలంగా అతడి సినిమాలు సరిగ్గా ఆడ లేదు. బాక్సాఫీస్ వద్ద రొటీన్ సినిమాలుగా తేలిపోతున్నాయి. దీంతో అవకాశాలు కూడా తగ్గాయి. గత సినిమా `విశ్వం` కూడా సరిగ్గా ఆడలేదు.
అయినా వైట్లకు మైత్రీమూవీ మేకర్స్ లో ఓ ఛాన్స్ వచ్చింది. అందులో హీరో ఎవరు ? అన్నది ఇంకా కన్పమ్ కాలేదు. ఇక డైరెక్టర్ గా వైట్ల బాగానే సంపాదించాడు. ఈ నేపథ్యంలో అతడు బాగా రిచ్ అంటూ వైరల్ అవుతుంది. 2000 కోట్ల అస్తిపరుడు అంటూ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ విషయాన్ని ఆయన ఖండించారు. తానేమి అంత ఆస్తి పరుడుని కాదన్నారు. అలాగే సినిమాల ద్వారా సంపాదించిన డబ్బు ఏది వృద్దా ఖర్చు చేయలేదన్నారు.
తన కష్టమంతా భూముల మీద పెట్టుబడిగా పెట్టినట్ల తెలిపారు. వ్యాపారాలు చేసే తెలివి తేటలు తనకు లేవని తీస్తే సినిమా తీయడం లేదంటే ఉన్న డబ్బుతో ఆస్తులు కొనడం తప్ప మరో మార్గం లేదన్నారు. కొన్న భూముల రేట్లు ఇప్పుడు బాగా పెరిగాయన్నారు. వ్యక్తిగతంగా తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు అన్నారు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటాను. అలాగని పిసినారిని అనుకోవద్దు.
అవసరమైన చోట డబ్బు ఖర్చు పెడతానన్నారు. కానీ డబ్బు ముఖ్యమా? సినిమాలు ముఖ్యమా? అంటే సినిమాలు ముఖ్యం అన్నారు. ఆ సినిమా లేకపోతే ఇప్పుడు నా దగ్గర డబ్బులుండేవి కాదు. అదంతా నాకు ఇండస్ట్రీ ఇచ్చింది. ప్రస్తుతం కుటుంబమంతా సంతోషంగా ఉందన్నారు.
