Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా భామకి ఇది ఊహించ‌న‌ది!

తాజాగా అమ్మ‌డు తెలుగులో సిద్దు జొన్న‌ల గ‌డ్డ స‌ర‌స‌న ఓ సినిమాకి సైన్ చేసింది.

By:  Tupaki Desk   |   17 Oct 2023 12:30 PM GMT
పాన్ ఇండియా భామకి ఇది ఊహించ‌న‌ది!
X

'కేజీఎఫ్' అనే డెబ్యూతోనే పాన్ ఇండియాలో సంచ‌ల‌న‌మైంది క‌న్న‌డ బ్యూటీ శ్రీనిధి శెట్టి. తొలి సినిమాతో ఇలాంటి గుర్తింపు రావ‌డం అన్న‌ది చిన్న విష‌యం కాదు. ఆ విష‌యంలో శ్రీనిధి ల‌క్కీ గాళ్ అనే అనాలి. పాన్ ఇండియా ఇమేజ్ కోసం ఎంతో మంది భామ‌లు ఎదురుచూస్తున్నా! ఎవ‌రికీ రాని అదృష్టం శ్రీనిధికి వ‌చ్చింది. కానీ ఏం లాభం కెరీర్ ప‌రంగా ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డ‌లేదు.

త‌న కెరీర్ తాను అనుకున్న దానికి రివ‌ర్స్ లో జ‌రుగుతున్న‌ట్లే క‌నిపిస్తుంది. 'కేజీఎఫ్' హిట్ త‌ర్వాత విక్ర‌మ్ తో 'కోబ్రా' సినిమా చేసింది. అది ప్లాప్ అయింది. కానీ ఆ ప్లాప్ అమ్మ‌డి ఇమేజ్ పై పెద్ద‌గా ప్ర‌భావం చూపేదేం కాదు. అదీ కేజీఎఫ్ హిట్ త‌ర్వాత నాలుగేళ్ల గ్యాప్ త‌ర్వాత చేసిన సినిమా అది. పాన్ ఇండియాలో గుర్తింపు రావ‌డంతో అన్ని భాష‌ల్లో అవ‌కాశాలు వ‌స్తాయి బిజీ అవ్వొచ్చ‌ని అమ్మ‌డు నాలుగేళ్లు ఖాళీగానే గ‌డిపేసింది.


మ‌రి వచ్చిన అవ‌కాశాలు కాద‌నుకుందా? లేక అవ‌కాశాలే రాక ఖాళీగా ఉందా? అన్న‌ది తెలియ‌దు. తాజాగా అమ్మ‌డు తెలుగులో సిద్దు జొన్న‌ల గ‌డ్డ స‌ర‌స‌న ఓ సినిమాకి సైన్ చేసింది. పాన్ ఇండియాలో ఐడెంటిటీ ఉన్న హీరోయిన్ ఒక్క‌సారిగా ఇలా చిన్న సినిమాకి సైన్ చేయ‌డం అమె అభిమానులు జీర్ణించుకోలేనిదే అయినా..అవ‌కాశం ఇవ్వ‌డం అన్న‌ది గొప్ప విష‌య‌మే. అమ్మ‌డికి ఏ ప‌రిశ్ర‌మ అవ‌కాశాలు ఇవ్వ‌ని స‌మ‌యంలో టాలీవుడ్ ఈ చిన్న సినిమాలో అవ‌కాశం క‌ల్పించింది.

ఆ ర‌కంగా తెలుగు ప‌రిశ్ర‌మ ఆమెని గుర్తించింద‌న చెప్పాలి. సిద్దు కూడా యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన న‌టుడు. అత‌ని స‌ర‌స‌న న‌టించిన హీరోయిన్ల‌కు ఓ ఐడెంటిటీ ద‌క్కుతుంది. మ‌రి నిధి తెలుగు సినిమాకి సంత‌కం చేసిన వైనంలో భ‌విష్య‌త్ లో ఇంకా ఎలాంటి అవ‌కాశాలు చేజిక్కించుకుం టుందో చూడాలి.