Begin typing your search above and press return to search.

శ్రీనిధి కి బాగానే ఇస్తున్నారట..!

అవకాశాలు తన దాకా రాలేదో లేక వచ్చిన ఛాన్స్ లను అమ్మడు కాదన్నదో కానీ శ్రీనిధి కోబ్రా తర్వాత మరో సినిమా కోసం చాలా టైం తీసుకుంది.

By:  Tupaki Desk   |   21 Oct 2023 10:30 AM GMT
శ్రీనిధి కి బాగానే ఇస్తున్నారట..!
X

కన్నడ భామ శ్రీనిధి శెట్టి మొదటి సినిమా కె.జి.ఎఫ్ తోనే సెన్సేషనల్ హిట్ అందుకుంది. కె.జి.ఎఫ్ రెండు పార్టులు పాన్ ఇండియా వైడ్ హిట్ అవగా ఆ సినిమాతో అమ్మడు సూపర్ పాపులర్ అయ్యింది. ఇక ఆ తర్వాత కోబ్రా సినిమా చేసింది. విక్రం కోబ్రా సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అమ్మడు ఆ సినిమా తో తగిలిన షాక్ ఊహించలేదు. పాన్ ఇండియా హిట్ కొట్టాక ఏ హీరోయిన్ కి అయినా వరుస అవకాశాలు వస్తాయి కానీ శ్రీనిధి విషయంలో మాత్రం అది జరగలేదు.

అవకాశాలు తన దాకా రాలేదో లేక వచ్చిన ఛాన్స్ లను అమ్మడు కాదన్నదో కానీ శ్రీనిధి కోబ్రా తర్వాత మరో సినిమా కోసం చాలా టైం తీసుకుంది. అయితే లేటెస్ట్ గా సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేస్తున్న తెలుసు కదా సినిమాతో అమ్మడు తెలుగు తెరకు పరిచయం అవుతుంది. కన్నడ భామలకు తెలుగులో మంచి క్రేజ్ ఉంటుంది. ఇప్పటికే కర్ణాటక నుంచి వచ్చిన చాలామందికి తెలుగులో స్టార్ క్రేజ్ వచ్చింది. వారి దారిలోనే శ్రీనిధి కూడా సత్తా చాటాలని చూస్తుంది.

సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా సినిమాను నీరజ కోన డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రీనిధితో పాటుగా రాశి ఖన్నా కూడా హీరోయిన్ గా నటిస్తుంది. అయితే తెలుసు కదా సినిమాలో నటించేందుకు గాను శ్రీనిధి శెట్టి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలుస్తుంది. సినిమాలో నటించేందుకు అమ్మడు కోటిన్నర దాకా రెమ్యునరేషన్ తీసుకుంటుందట. శ్రీనిధి వల్ల తెలుసు కదా సినిమాకు సౌత్ ఇండస్ట్రీ మొత్తం క్రేజ్ ఏర్పడుతుంది.

డీజే టిల్లు తర్వాత సిద్ధు జొన్నలడ్డ సినిమాలకు సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఆల్రెడీ అతను టిల్లు స్క్వేర్ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆ సినిమా తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. దానితో పాటుగా నీరజ కోన డైరెక్షన్ లో తెలుసు కదా కూడా వస్తుంది. ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటనున్నాడు సిద్ధు. శ్రీనిధి కూడా ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు గెలవాలని చూస్తుంది. శ్రీనిధి శెట్టి తెలుగు సినిమాలో నటించడం ఆమె తెలుగు ఫ్యాన్స్ కి సూపర్ జోష్ అందిస్తుంది. అమ్మడు ఇక్కడ వరుస సినిమాలు చేయాలని ఆమె ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కోరుతున్నారు.