శ్రీనిధి మొత్తానికి కొట్టేసిందిగా..!
కె.జి.ఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ అమ్మడు ఆ సినిమాల్లో క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది.
By: Tupaki Desk | 2 May 2025 6:29 AMహీరోయిన్ గా ఛాన్స్ రావడం ఒక ఎత్తైతే కెరీర్ ని సక్సెస్ పాత్ లో నడిపించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్రమంలో కొందరు భామలు ఎంత ఊపు మీద వచ్చారో అదే ఊపులో బయటకు వెళ్తారు. ఐతే కెరీర్ ని కన్ సిస్టెంట్ సక్సెస్ లను మెయిన్ టైన్ చేయాలంటే చాలా ఫోకస్ గా ఉండాలి. ఒకటి రెండు సినిమాలు చేసి ఆ తర్వాత ఇష్టం వచ్చినట్టుగా చేస్తే జనాలు కూడా పట్టించుకోవడం మానేస్తారు. ఫ్లాప్ పడిన తర్వాత ఎప్పుడెప్పుడు సక్సెస్ వస్తుందా అనే హోప్ తో పనిచేస్తుంటారు. పాన్ ఇండియా హిట్ కొట్టినా సరే ఒక ఫ్లాప్ పడితే మాత్రం రిస్క్ లో పడినట్టే. తిరిగి హిట్ కొట్టేదాకా కాస్త కంగారు ఉంటుంది.
ఐతే అలాంటి ఒక సందర్భం నుంచి హిట్ తో ట్రాక్ లోకి వచ్చింది శ్రీనిధి శెట్టి. కె.జి.ఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ అమ్మడు ఆ సినిమాల్లో క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. కె.జి.ఎఫ్ 1, 2 హిట్ తర్వాత వెంటనే ఐదారు ఛాన్స్ లు పట్టేస్తుందని అనుకున్నారు. కానీ అది కుదరలేదు. బహుశా అమ్మడే కావాలని తనకు నచ్చిన కథ కోసం వెయిట్ చేసి ఉండొచ్చు. ఐతే కె.జి.ఎఫ్ తర్వాత ఏరి కోరి చియాన్ విక్రమ్ తో కోబ్రా సినిమా చేసింది శ్రీనిధి శెట్టి.
ఆ సినిమా ఫలితం అమ్మడికి షాక్ ఇచ్చింది. సూపర్ హిట్ కథలను వదిలి విక్రం సినిమా అయితే వర్క్ అవుట్ అవుతుంది అనుకున్న అమ్మడికి మైండ్ బ్లాక్ అయ్యింది. అందుకే మళ్లీ డైలమాలో పడింది. ఐతే తెలుగు నుంచి ఇదివరకు వచ్చిన ఛాన్స్ లు కాదన్న ఈ బ్యూటీ సిద్ధు జొన్నలగడ్డతో తెలుసు కదా సినిమాకు ఓకే చెప్పింది. ఆ సినిమా టైంలోనే నాని హిట్ 3 కి సెలెక్ట్ అయ్యింది. విచిత్రం ఏంటంటే తెలుసు కదా ఇంకా రిలీజ్ కాలేదు కానీ హిట్ 3 రిలీజై సక్సెస్ టాక్ సొంతం చేసుకుంది.
నాని ఈమధ్య ఏ సినిమా చేసినా కూడా అదిరిపోతుంది. శైలేష్ కొలను డైరెక్షన్ లో హిట్ 3 అంటూ మరో విధ్వంసం సృష్టించాడు నాని. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీనిధి శెట్టికి లక్ కలిసి వచ్చింది. మొత్తానికి కోబ్రా తో షాక్ తిన్న శ్రీనిధి హిట్ 3 తో హిట్ ట్రాక్ ఎక్కింది. నెక్స్ట్ సిద్ధు తో తెలుసు కదా సినిమా లైన్ లో ఉంది. తప్పకుండా ఈ కాంబో సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని చెప్పొచ్చు.