ఐకాన్ స్టార్ లిస్ట్ లో శ్రీనిధి చేరిందా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 22వ చిత్రం అట్లీ దర్శకత్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 9 May 2025 8:03 AMఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 22వ చిత్రం అట్లీ దర్శకత్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే. భారీ కాన్వాస్ పై చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారని ప్రచారం పీక్స్ లో జరుగుతుంది. దీనిలో భాగంగా చాలా మంది బ్యూటీల పేర్లు తెరపైకి వచ్చాయి. దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, అనన్య పాండే, సమంత పేర్లు తెరపైకి వచ్చాయి. వీళ్లలో ముగ్గురు భామలు ఎవరు అవుతారు? అన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే సమంతకు ఆ ఛాన్స్ రాలేదని ఇటీవలే క్లారిటీ ఇచ్చింది. దీంతో బన్నీ సరసన రేసులో సమంత ఎగ్జిట్ అయినట్లు అయింది. ఈ నేపథ్యంలో తాజాగా కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి పేరు తెరపైకి వస్తుంది. ఇందులో బన్నీకి మెయిన్ లీడ్ గా ఈ భామనే తీసుకుంటున్నారనే కొత్త ప్రచారం మొదలైంది. అట్లీ రాసిన పాత్రకు శ్రీనిధి పర్పెక్ట్ గా సెట్ అవుతుందని అందుకే తొలి అవకాశం ఆమెకే ఇస్తున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి.
మరి ఇందులో వాస్తవం ఎంతో తెలియాలి. 'కేజీఎఫ్' తో శ్రీనిధి శెట్టి పాన్ ఇండియాలో వెలుగులోకి వచ్చిన సంగతి తెలసిందే. కానీ అటుపై పెద్దగా అవకాశాలు రాలేదు. ఇటీవల రిలీజ్ అయిన 'హిట్ 3'లో నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. 'కేజీఎఫ్' కంటే హిట్ 3లో కాస్త మంచి రోల్ పడింది. నటనకు ఆస్కారం కనిపించింది. అందమైన నటిగాను అమ్మడు హైలైట్ అయింది.
ప్రచార కార్యక్రమాల్లోనూ పద్దతైన చీర కట్టుకుని కనిపించింది. హీరోయిన్ అయినా తనకంటు కొన్ని పరిమితులున్నాయని మోడ్రన్ దుస్తులకు..అందాల ప్రదర్శనకు దూరంగా ఉంది. ఆ రకంగా శ్రీనిధి డీసెంట్ గాళ్ల్ గా హైలైట్ అవుతుంది. మరి ఐకాన్ స్టార్ చిత్రంలో ఛాన్స్ వస్తే గనుక తిరుగుండదు.