త్రివిక్రమ్ హీరోయిన్ తెలివైన ప్లాన్
కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా హిట్ పడితే ఏ హీరోయిన్ అయినా వెంటనే పారితోషికం పెంచేసి వరుస కమర్షియల్ సినిమాలు సైన్ చేస్తుంది.
By: Tupaki Desk | 2 Oct 2026 9:20 AM ISTకేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా హిట్ పడితే ఏ హీరోయిన్ అయినా వెంటనే పారితోషికం పెంచేసి వరుస కమర్షియల్ సినిమాలు సైన్ చేస్తుంది. టాలీవుడ్ కు వచ్చే చాలామంది భామలు చేసేది ఇదే. కానీ శ్రీనిధి శెట్టి రూటు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. లేటెస్ట్ గా 'ఆదర్శ కుటుంబం' ఇంటర్వ్యూలో రెమ్యునరేషన్ పై ఆమె చేసిన కామెంట్స్ వింటే, టాలీవుడ్ లో లాంగ్ టర్మ్ సర్వైవల్ కోసం ఆమె వేస్తున్న పక్కా స్కెచ్ ఏంటో అర్థమవుతుంది.
డబ్బు కోసం సినిమాలు చేస్తే ఈ పదేళ్లలో నలభై సినిమాలు చేసేదాన్ని అంటూ శ్రీనిధి ఇచ్చిన క్లారిటీ ఆలోచింపజేసేలా ఉంది. ఒక్క హిట్ రాగానే చేతికొచ్చిన ప్రాజెక్ట్ ఓకే చేసి ఫేడ్ అవుట్ అయిపోయే ట్రెండ్ కు ఇది కరెక్ట్ కౌంటర్. క్రేజ్ ను క్యాష్ చేసుకోవడం కంటే కెరీర్ గ్రాఫ్ పడిపోకుండా కాపాడుకోవడం మీదే ఆమె ఎక్కువ ఫోకస్ పెట్టిందనే విషయం అర్థమవుతుంది.
యంగ్ స్టార్స్ పక్కన గ్లామర్ రోల్స్ చేస్తే భారీగా డబ్బులు వస్తాయి. కానీ శ్రీనిధి ఆ ట్రాక్ వదిలేసి వెంకటేష్ పక్కన నటించడానికి ఓకే చెప్పింది. దీనికి ప్రధాన కారణం త్రివిక్రమ్ రైటింగ్. ఆయన సినిమాల్లో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. కేవలం డబ్బు వెనక పరిగెత్తకుండా, స్వర్ణ లాంటి ఒక పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రను ఎంచుకోవడం వెనుక ఆమె ప్లాన్ ఇక్కడే క్లియర్ గా తెలుస్తోంది.
వరుసగా సీరియస్ యాక్షన్ జానర్స్ తో వచ్చిన ఇమేజ్ ను బ్రేక్ చేయాలనేది ఆమె మరో టార్గెట్. తెలుగులో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైతేనే ఎక్కువ కాలం నిలబడగలం అనే లాజిక్ ను శ్రీనిధి బాగా క్యాచ్ చేసింది. అందుకే మొదటిసారి పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్ ను సెలెక్ట్ చేసుకుంది. త్రివిక్రమ్ సెట్ లో తనలోని కామెడీ యాంగిల్ బయటపెడితే ఆమెకు మరిన్ని దారులు ఓపెన్ అవుతాయనేది ప్లాన్ కావచ్చు.
కొత్త డైరెక్టర్ అయినా సరే కథ బాగుంటే తక్కువ పారితోషికానికైనా పని చేస్తానని చెప్పడం ఆమె వేసిన మరో తెలివైన అడుగు. భారీ సినిమాల కోసం వెయిట్ చేయకుండా కంటెంట్ ఉన్న చిన్న సినిమాలతో యాక్టింగ్ స్కిల్స్ ప్రూవ్ చేసుకోవాలనే తాపత్రయం ఇందులో కనిపిస్తోంది. డబ్బుకంటే క్యారెక్టర్ కు వాల్యూ ఇస్తున్నాననే సిగ్నల్ ఇవ్వడం ద్వారా మేకర్స్ కు తన తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని నేరుగా చెప్పేసింది. ఇక అక్టోబర్ 9న వచ్చే ఆదర్శ కుటుంబం థియేటర్లలో హిట్ అయితే గనక, ఈ బ్యూటీ క్యాలిక్యులేషన్స్ టాలీవుడ్ లో నూరు శాతం వర్కౌట్ అయినట్లే లెక్క.
