హిట్ సెంటిమెంట్ పట్టేసిన శ్రీనిధి
అలాంటి శ్రీనిధి ఇప్పుడు హిట్3 సినిమా ద్వారా టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తోంది. హిట్3 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రీనిధి మాట్లాడిన స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది.
By: Tupaki Desk | 28 April 2025 6:57 AMతెలుగు రాష్ట్రాల్లో పుట్టి, ఇక్కడే పెరిగినప్పటికీ కొంతమంది ప్రీ రిలీజ్ ఈవెంట్లలో, ప్రెస్ మీట్లలో తెలుగులో కాకుండా ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటారు. కానీ పక్క రాష్ట్రం నుంచి వచ్చిన హీరోయిన్లు మాత్రం తెలుగు భాష మీద, తెలుగు ఆడియన్స్ మీద ప్రేమతో కష్టపడి తెలుగు నేర్చుకుని మరీ స్పష్టంగా మాట్లాడాలని ట్రై చేసి, తెలుగులో మాట్లాడి ఇంప్రెస్ చేస్తున్నారు.
ఇప్పుడు శ్రీనిధి శెట్టి కూడా ఈ బాటలోనే వెళ్తుంది. కెజిఎఫ్ ఫ్రాంచైజ్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన శ్రీనిధి ఎలాంటి క్రేజ్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. సినిమాల్లోకి రాకముందు శ్రీనిధి మంచి స్టూడెంట్. టెన్త్ లో 98% మార్కులతో టాపర్ గా నిలిచిన అమ్మడు, కాలేజ్ లో కూడా టాపరేనట. చదువయ్యాక మోడలింగ్ లోకి అడుగుపెట్టి మిస్ కర్ణాటక కిరీటాన్ని అందుకున్న శ్రీనిధి ఆ తర్వాత హీరోయిన్ గా మారి మంచి సక్సెస్ ను, క్రేజ్ ను అందుకుంది.
అలాంటి శ్రీనిధి ఇప్పుడు హిట్3 సినిమా ద్వారా టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తోంది. హిట్3 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రీనిధి మాట్లాడిన స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. ఈ ఈవెంట్ లో శ్రీనిధి ఆల్మోస్ట్ 10 నిమిషాలు మాట్లాడగా, అందులో ఎక్కువగా తెలుగే మాట్లాడింది. శ్రీనిధి స్పీచ్ లో మధ్యలో అక్కడక్కడా కొన్ని తప్పులున్నప్పటికీ తెలుగులోనే మాట్లాడాలనే శ్రీనిధి తపన ముందు ఆ తప్పులు ఎవరికీ పెద్దగా కనిపించలేదు.
హిట్3 సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని చెప్పిన శ్రీనిధి శెట్టి, నాని సర్ చాలా మంచి ప్రొడ్యూసర్ అని, వాల్ పోస్టర్ సినిమాస్ చాలా మంచి ప్రొడక్షన్ హౌస్ అని, నాని గారు, ప్రశాంతి గారు తనను ఎంతో బాగా చూసుకున్నారని చెప్పింది. ఇప్పటివరకు తాను హిట్3 కోసం నాని గారితో కలిసి 30కి పైగా ఇంటర్వ్యూలిచ్చానని, మూడేళ్ల తర్వాత ఆడియన్స్ ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉండటంతో పాటూ ఎగ్జైటింగ్ గా ఉందని శ్రీనిధి చెప్పుకొచ్చింది.
తాను కాలేజ్ లో ఉన్నప్పుడు నాని సినిమాలు ఎన్నో చూశానని, అప్పట్నుంచే నాని గారితో సినిమా చేయాలని కోరిక ఉండేదని, ఆ కోరిక ఇంత త్వరగా తీరుతుందనుకోలేదని, ఈ విషయంలో తాను చాలా గ్రేట్ గా ఫీలవుతున్నట్టు చెప్పిన శ్రీనిధి, మాట వరసకు నానిని నాని గారు అని పిలుస్తున్నానని కూడా చెప్పింది. ఇక రాజమౌళి గురించి మాట్లాడుతూ, తన మొదటి సినిమా కెజిఎఫ్ మూవీ ఆడియో లాంచ్ కు గెస్ట్ గా రాజమౌళినే వచ్చారని, ఇప్పుడు మళ్లీ హిట్3 కు కూడా మీరే వచ్చారని, కెజిఎఫ్ ఈవెంట్ కు కూడా సుమనే యాంకర్, ఈ సినిమాకు కూడా సుమనే యాంకర్ అని.. రాజమౌళి, సుమ, శ్రీనిధి ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అయింది కాబట్టి, కెజిఎఫ్ లానే ఈ సినిమా కూడా హిట్ అవుతుందని శ్రీనిధి నమ్మకం వ్యక్తం చేసింది.