Begin typing your search above and press return to search.

అందాల భామ అంత డిమాండ్ చేయదట..!

కె.జి.ఎఫ్ తర్వాత తెలుగు నుంచి ఆఫర్లు వచ్చినా పెద్దగా పట్టించుకోని అమ్మడు లేటెస్ట్ గా నానితో హిట్ 3 చేసి సూపర్ హిట్ అందుకుంది.

By:  Tupaki Desk   |   9 May 2025 5:08 PM
అందాల భామ అంత డిమాండ్ చేయదట..!
X

కె.జి.ఎఫ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన శ్రీనిధి శెట్టి ఆ సినిమా రెండు భాగాలు సూపర్ సక్సెస్ అందుకోగా ఒక రేంజ్ పాపులారిటీ తెచ్చుకుంది. అఫ్కోర్స్ సినిమాలో ఆమె రోల్ మరీ అంతగా లేకపోయినా అంత పెద్ద సినిమాలో తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది అమ్మడు. ఐతే కె.జి.ఎఫ్ లాంటి హిట్ పడ్డాక అసలైతే అమ్మడికి ఒక రేంజ్ లో రావాలి కానీ ఎందుకో ఆశించిన స్థాయిలో రాలేదు. కె.జి.ఎఫ్ తర్వాత చియాన్ విక్రమ్ తో తెలుసు కదా సినిమా చేసింది శ్రీనిధి ఆ సినిమా అంచనాలను అందుకోలేదు.

కె.జి.ఎఫ్ తర్వాత తెలుగు నుంచి ఆఫర్లు వచ్చినా పెద్దగా పట్టించుకోని అమ్మడు లేటెస్ట్ గా నానితో హిట్ 3 చేసి సూపర్ హిట్ అందుకుంది. నాని హిట్ 3 కన్నా ముందే అమ్మడు సిద్ధు జొన్నలగడ్డతో తెలుసు కదా సినిమాకు సైన్ చేసింది. ఆ సినిమా ఇంకా షూటింగ్ జరుపుకుంటుంది. హిట్ 3 లో మృదుల పాత్రలో శ్రీనిధి ఆకట్టుకుంది. యాక్షన్ సీన్స్ లో కూడా అమ్మడు సర్ ప్రైజ్ చేసింది.

హిట్ 3 హిట్ పడింది కాబట్టి శ్రీనిధి తెలుగు ఎంట్రీ సక్సెస్ ఫుల్ అయ్యింది. ఇక నెక్స్ట్ సినిమా ఏం జరుగుతుందో చూడాలి. ఐతే శ్రీనిధి శెట్టి సినిమాలు చేయకపోవడానికి రెమ్యునరేషన్ కారణమని కొన్ని వార్తలు వచ్చాయి. కానీ వాటిల్లో ఏమాత్రం నిజం లేదని తెలుస్తుంది. హిట్ 3 కి శ్రీనిధి రెమ్యునరేషన్ కూడా మరీ అంత ఎక్కువ ఏమి కాదట. అంతేకాదు అసలు అమ్మడు రెమ్యునరేషన్ విషయంలో అంత పట్టింపు ఉండదట.

సినిమా కథ నచ్చితే రెమ్యునరేషన్ సెకండరీ అంటుందట. నేడు జరిగిన హిట్ 3 సక్సెస్ మీట్ లో కూడా శ్రీనిధి మాటలు వింటే ఆమె మీద ప్రశంసలు కురిపిస్తారు. తనకు ఈ సినిమా చేయడానికి సహకరించిన వారందరి పేర్లు మొబైల్ లో చూసి మరీ వాళ్లకు తన థాంక్స్ చెప్పింది శ్రెనిధి. సో అమ్మడి మీద బయట వచ్చిన వార్తలన్నీ ఎవరో కావాలని రాసినవే తప్ప శ్రీనిధి కథ బాగుంటే అసలు రెమ్యునరేషన్ గురించి పట్టించుకునే హీరోయిన్ కాదని అర్ధమవుతుంది. ఏది ఏమైనా అందాల భామకు తెలుగులో చేసిన మొదటి సినిమానే ఇంత మంచి సక్సెస్ అవ్వడం ఆమె నెక్స్ట్ సినిమాలకు మంచి పుష్ ఇస్తుందని చెప్పొచ్చు.