Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : తెలుసు కదా హీరోయిన్స్‌ లవ్‌ ఫోజ్‌

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందుతున్న 'తెలుసు కదా' సినిమాలో హీరోయిన్స్‌గా శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నాలు నటించారు.

By:  Tupaki Desk   |   27 Jun 2025 6:00 AM IST
పిక్‌టాక్‌ : తెలుసు కదా హీరోయిన్స్‌ లవ్‌ ఫోజ్‌
X

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందుతున్న 'తెలుసు కదా' సినిమాలో హీరోయిన్స్‌గా శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నాలు నటించారు. వీరిద్దరి కాంబోలో చాలా సీన్స్ ఉండేలా ఉన్నాయి. సాధారణంగా ఇద్దరు హీరోయిన్స్ ఉంటే కాంబో సీన్స్ చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఈ సినిమాలో మాత్రం హీరోయిన్స్ కాంబో సీన్స్ ఎక్కువగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇదో విభిన్నమైన లవ్‌ స్టోరీ మూవీ అంటున్నారు. ఇప్పటికే సిద్దు జొన్నలగడ్డతో వీరిద్దరు చేసిన ఒక వీడియోను విడుదల చేయడం ద్వారా సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయమై క్లారిటీ ఇచ్చారు. ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య నలిగిపోయే పాత్రలో సిద్దు నవ్వులు పూయించే అవకాశాలు ఉన్నాయి.


ఇన్నాళ్లు కాస్ట్యూమ్స్ డైజనర్‌గా, స్టార్‌ హీరోయిన్స్‌కు స్టైలిస్ట్‌గా చేస్తూ వచ్చిన నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం కాబోతుంది. దాదాపు ఏడాది పాటు మేకింగ్‌కు తీసుకున్న ఈమె ముగింపు దశకు తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా సినిమాను అక్టోబర్‌ 17, 2025న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. ఈ సినిమాను విభిన్నంగా ప్రమోట్‌ చేయాలి అనే ఉద్దేశంతో ఇప్పటికే మంచి కంటెంట్‌ వీడియోలను తయారు చేశారట. అందులో భాగంగానే సిద్దు జొన్నలగడ్డ వీడియో కాల్‌ వీడియోను విడుదల చేయడం జరిగింది. ఆ వీడియోలో ఇద్దరు ముద్దుగుమ్మలు కనిపించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

తాజాగా శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా లు లవ్‌ సింబల్‌ను పెట్టిన ఫోటోను షేర్‌ చేశారు. సాధారణంగా అమ్మాయి, అబ్బాయి ఇలా లవ్‌ సింబల్‌ను రెండు చేతులతో ఏర్పాటు చేస్తే అది కచ్చితంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కానీ హీరోయిన్స్ ఇద్దరూ లవ్‌ సింబల్‌ ను పెట్టినా కూడా ఫోటో వైరల్‌ అవుతోంది. ఈ ఫోటోను దర్శకురాలు నీరజ కోన తీసినట్లు హీరోయిన్స్‌ ఆమె పేరును ట్యాగ్‌ చేశారు. రాశి ఖన్నా ఈ ఫోటోను షేర్‌ చేస్తూ హృదయాన్ని తయారు చేశాం, తర్వాత కొన్నింటిని బ్రేక్‌ చేసింది అంటూ లవ్‌ ఈమోజీని సైతం షేర్‌ చేసింది. ఇప్పటి వరకు కాన్సెప్ట్‌ గురించి నీరజ క్లారిటీ ఇవ్వకుండా ఇలాంటి ఫోటోలు, వీడియోలతో తెలుసు కదా అంటూ అంచనాలు పెంచుతోంది.

కేజీఎఫ్‌ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి ఇటీవల హిట్‌ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో యాక్షన్‌ సీన్‌లో కూడా నటించి మెప్పించింది. టాలీవుడ్‌లో ఈ అమ్మడికి మంచి భవిష్యత్తు ఉంటుందని అంతా అంటున్నారు. ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్‌కు ఈ అమ్మడు ఓకే చెప్పలేదు. తెలుసు కదా సినిమా వచ్చిన తర్వాత తప్పకుండా ఈమెకు మరింత బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఇక రాశి ఖన్నా చాలా కాలం తర్వాత తెలుగులో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాపై ఆమెకు చాలా ఆశలు ఉన్నాయి. ఇక సిద్దు జొన్నలగడ్డ గత చిత్రం జాక్‌ నిరాశను మిగిల్చింది. అందుకే ఈ సినిమా హిట్‌ కొట్టేనా చూడాలి.