శ్రీనిధి శెట్టి మల్టీ టాలెంటెడ్..!
కె.జి.ఎఫ్ తర్వాత అమ్మడు చియాన్ విక్రమ్ తో కోబ్రా సినిమా చేసింది. ఆ సినిమా హిట్ అయితే పరిస్థితి ఎలా ఉండేదేమో కానీ అది ఫ్లాప్ అవ్వడం వల్ల కె.జి.ఎఫ్ తో వచ్చిన క్రేజ్ అంతా పోయింది
By: Tupaki Desk | 24 April 2025 8:10 PM ISTకె.జి.ఎఫ్ లాంటి పాన్ ఇండియా హిట్ తో తెరంగేట్రం చేసిన బ్యూటీ శ్రీనిధి శెట్టి. మొదటి సినిమానే ఆ రేంజ్ సక్సెస్ అందుకున్న ఈ అమ్మడికి అసలైతే వరుస ఛాన్స్ లు వచ్చి అదరగొట్టాలి. కానీ కె.జి.ఎఫ్ రెండు భాగాలు చేసినా శ్రీనిధికి సరైన ఛాన్స్ లు రాలేదు. కె.జి.ఎఫ్ తర్వాత అమ్మడు చియాన్ విక్రమ్ తో కోబ్రా సినిమా చేసింది. ఆ సినిమా హిట్ అయితే పరిస్థితి ఎలా ఉండేదేమో కానీ అది ఫ్లాప్ అవ్వడం వల్ల కె.జి.ఎఫ్ తో వచ్చిన క్రేజ్ అంతా పోయింది.
ఐతే శ్రీనిధికి తెలుగు నుంచి క్రేజీ ఆఫర్లు వచ్చినా అప్పుడు నో చెప్పిందన్న టాక్ ఉంది. తెలుగులో శ్రీనిధి మొదటిగా సిద్ధు జొన్నలగడ్డతో తెలుసు కదా సినిమా సైన్ చేసింది. ఆ సినిమా ఇంకా సెట్స్ మీదే ఉంది. ఈలోగా నాని హిట్ 3లో ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారు. నాని నిర్మాతగా శైలేష్ కొలను డైరెక్షన్ లో హిట్ ఫ్రాంచైజీలో భాగంగా హిట్ 3 వస్తుంది.
హిట్ 3 సినిమాకు ప్రతి విషయంలో శ్రీనిధి సపోర్ట్ చేసిందని తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆ సినిమా హీరో నిర్మాత నాని చెప్పాడు. హిట్ 3 ప్రమోషన్స్ లో నాని శ్రీనిధిని పొగడ్తలతో ముంచెత్తాడు. శ్రీనిధి హిట్ 3 సినిమా కోసం ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేసిందని అన్నాడు నాని. AD గా టైటిల్స్ లో ఆమె పేరు కూడా వేయిస్తానని సరదాగా చెప్పాడు నాని.
అంతేకాదు సినిమా పట్ల ఆమెకున్న డెడికేషన్ ఎలాంటిది అని తెలిసేలా హిట్ 3 ప్రమోషన్స్ లో కూడా యాక్టివ్ గా పాల్గొంటుంది అమ్మడు. హిట్ 3 హిట్ పడితే కచ్చితంగా శ్రీనిధికి తెలుగులో మరిన్ని ఛాన్స్ లు వచ్చే అవకాశం ఉంటుంది. మరి శ్రీనిధి ఇంత సపోర్ట్ చేస్తూ చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయన్నది చూడాలి. శ్రీనిధి మాత్రం రిజల్ట్ తో సంబంధం లేకుండా తన సినిమాలు తాను చేసుకుంటూ వెళ్తానని చెప్పుకొచ్చింది. నాని హిట్ 3 ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా సినిమాపై అంచనాలు పెంచింది. సినిమా విషయంలో నాని అండ్ టీం కూడా సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి సినిమా ఏం జరుగుతుందో చూడాలి.
