అది తట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్లా
మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన శ్రీనిధి శెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. కానీ ఆ గ్యాప్ లో కెరీర్లో ఎదగడానికి శ్రీనిధి చాలానే కష్టపడింది.
By: Tupaki Desk | 8 May 2025 6:36 PM ISTమోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన శ్రీనిధి శెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. కానీ ఆ గ్యాప్ లో కెరీర్లో ఎదగడానికి శ్రీనిధి చాలానే కష్టపడింది. తన జర్నీలో ఎన్నో బాధలను అధిగమించి ఈ స్థాయికి చేరానని చెప్పిన శ్రీనిధి చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి కొన్నాళ్ల పాటూ డిప్రెషన్ లోకి కూడా వెళ్లిందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీనిధి తన తల్లి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది.
శ్రీనిధి టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడే తన తల్లి చనిపోయిందట. ఆ షాక్ ను తట్టుకోలేక కొన్నాళ్ల పాటూ డిప్రెషన్ లోకి వెళ్లానని చెప్తున్న శ్రీనిధికి ఆ టైమ్ లో ఇంట్లో ఉండాలనిపించలేదని, గతాన్ని మర్చిపోయేందుకు బెంగుళూరుకు వెళ్లానని, అయినా తల్లిని మర్చిపోలేకపోయానని, చాలా రోజులు ఆమెను తలుచుకుంటూ ఏడ్చానని, ఆ విషాదం నుంచి బటయపడటానికి చాలానే టైమ్ పట్టిందని, తల్లి చనిపోయాక తండ్రి తనకెంతో సపోర్ట్ గా నిలిచారని శ్రీనిధి తెలిపింది.
ఇక బెంగుళూరుతో తనకున్న అనుబంధాన్ని చెప్తూ, అక్కడికి వచ్చాకే తన లైఫ్ పూర్తిగా మారిందని, జైన్ యూనివర్సిటీలో బీటెక్ అయిపోయాక కొన్నాళ్ల పాటూ ఉద్యోగం చేశానని, మోడలింగ్ పై ఇంట్రెస్ట్ తో ఆ రంగంలోకి అడుగుపెట్టినట్టు చెప్పుకొచ్చింది. 2016లో మిస్ సుప్రానేషనల్ టైటిల్ గెలవడం, ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి పాన్ ఇండియన్ సినిమాల్లో నటించడం తలచుకుంటే అంతా ఓ కలలా అనిపిస్తుందని శ్రీనిధి చెప్పింది.
కెజిఎఫ్ మూవీతో హీరోయిన్ గా వెండితెర అరంగేట్రం చేసిన శ్రీనిధి కెజిఎఫ్2 తో మరింత పాపులరైంది. ఆ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ అయితే తెచ్చుకుంది కానీ స్టార్‌డమ్ మాత్రం సంపాదించుకోలేక పోయింది. కెజిఎఫ్ తర్వాత తమిళంలో విక్రమ్ తో కలిసి కోబ్రా చేయగా ఆ సినిమా అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయింది.
రీసెంట్ గా నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన హిట్3 సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఆ సినిమాతో మంచి హిట్ తో పాటూ స్టార్‌డమ్ ను కూడా అందుకుంది. ప్రస్తుతం శ్రీనిధి టాలీవుడ్ లో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తెలుసు కదా సినిమాలో నటిస్తోంది. దీంతో పాటూ కన్నడలో కిచ్చ సుదీప్ తో ఓ సినిమాలో నటిస్తోంది.
