Begin typing your search above and press return to search.

కేజీఎఫ్ బ్యూటీ ఈసారి గట్టిగా కొట్టాల్సిందే!

కేజీఎఫ్ మూవీతో సినీ ఇండస్ట్రీకి శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా పరిచయమైన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   18 April 2025 6:35 AM
Srinidhi Shetty Hopes On HIT3
X

కేజీఎఫ్ మూవీతో సినీ ఇండస్ట్రీకి శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా పరిచయమైన విషయం తెలిసిందే. బీటెక్ చదివిన అమ్మడు.. కొంతకాలంపాటు జాబ్ చేసి రిజైన్ చేసింది. ఆ తర్వాత మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. పలు యాడ్స్ లో అలరించిందనే చెప్పాలి. అదే సమయంలో మిస్ కర్ణాటక, మిస్ సూపర్ నేషనల్ సహా పలు టైటిల్స్ ను దక్కించుకుంది.

అప్పుడే ఆమె పిక్స్ చూసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఆడిషన్స్ కు పిలిచారు. ఆ తర్వాత హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. అయితే ప్రశాంత్ నీల్, రాకింగ్ స్టార్ యష్ కాంబినేషన్ లో వచ్చిన కేజీఎఫ్ సిరీస్ చిత్రాలు ఎలాంటి హిట్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ఆ రెండు సినిమాల్లోనూ హీరోయిన్ గా శ్రీనిధి శెట్టినే యాక్ట్ చేసింది.

రెండు సినిమాలకు గాను ఏడేళ్లపాటు కేటాయించిన శ్రీనిధి.. ఓ రేంజ్ లో పాపులారిటీ సొంతం చేసుకుంది. స్టార్ డామ్ కూడా దక్కించుకున్నా దాన్ని కాపాడుకోలేకపోయిందనే చెప్పాలి. కేజీఎఫ్ సినిమా తర్వాత విక్రమ్ చియాన్ మూవీ కోబ్రాలో ఆమె నటించగా, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా మారింది.

దీంతో అమ్మడికి అవకాశాలు తగ్గిపోయాయి. రెండు ఇండస్ట్రీ హిట్స్ కొట్టినా.. ఆమె ఇంటి తలుపును ఛాన్స్ లు తట్టలేదు. ఆ తర్వాత స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ మూవీ తెలుసు కదాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. నీరజ కోన దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాతో టాలీవుడ్ డెబ్యూ ఇచ్చేందుకు సిద్ధమైంది అమ్మడు.

ప్రస్తుతం షూటింగ్ జరుగుతుండగా,.. ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. అయితే తెలుసు కదా కన్నా ముందే హిట్ -3 మూవీతో టాలీవుడ్ లో సందడి చేయనుంది. నేచురల్ స్టార్ నాని, శైలేష్ కొలను కాంబినేషన్ లో రూపొందుతున్న ఆ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆడియన్స్ లో ఓ రేంజ్ లో హోప్స్ ఉన్నాయి.

దీంతో మూవీ హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే హిట్-3లో శ్రీనిధికి మంచి ప్రాధాన్యం ఉన్న రోల్ దక్కి.. మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తే ఆమె కెరీర్ స్వింగ్ లోకి వెళ్లే అవకాశాలు ఫుల్ గా ఉన్నాయి. తెలుగులో వరుస ఛాన్స్ లు అందుకునే స్కోప్ కూడా ఉంది. కాబట్టి గట్టి హిట్ కొట్టాల్సిందేనని అంతా అంటున్నారు. మరి హిట్-3 మూవీ ఎలా ఉంటుందో.. శ్రీనిధికి ఎలాంటి హిట్ అందుకుంటుందో వేచి చూడాలి.