టాలీవుడ్ లో కన్నడ భామల డిమాండ్
హీరోయిన్ శ్రీనిధి శెట్టి కి ఎంతో టాలెంట్ ఉంది. కెజిఎఫ్ ఫ్రాంచైజ్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి అందరికీ పరిచయమైంది శ్రీనిధి.
By: Tupaki Desk | 5 May 2025 9:30 AMహీరోయిన్ శ్రీనిధి శెట్టి కి ఎంతో టాలెంట్ ఉంది. కెజిఎఫ్ ఫ్రాంచైజ్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి అందరికీ పరిచయమైంది శ్రీనిధి. కానీ ఆ సినిమాలు హీరో పాత్ర ప్రధానంగా తెరకెక్కడంతో శ్రీనిధి శెట్టి కేవలం గ్లామర్ పాత్రకే పరిమితమైంది. కెజిఎఫ్ సినిమాల్లో నటించడం ద్వారా శ్రీనిధికి పాన్ ఇండియా స్థాయిలో అటెన్షన్ అయితే వచ్చింది కానీ స్టార్‌డమ్ మాత్రం రాలేదు. కానీ రీసెంట్ గా తెలుగులో శ్రీనిధి చేసిన హిట్3 సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ఆ సినిమా అమ్మడికి మంచి స్టార్ డమ్‌ను తెచ్చి పెట్టింది. హిట్3 సక్సెస్ తో శ్రీనిధి తెలుగులో బిజీ అయ్యే అవకాశాలు పుష్కలంగానే కనిపిస్తున్నాయి.
అయితే ఇక్కడో ఇంట్రెస్టింగ్ విషయముంది. కన్నడ సినిమా నుంచి వచ్చిన రష్మిక మందన్నా, శ్రీలీల తమ కెరీర్ ను కన్నడలోనే మొదలుపెట్టారు కానీ ఎప్పుడైతే తెలుగు సినిమాలు చేశారో అప్పట్నుంచి వారికి విపరీతమైన స్టార్‌డమ్ వచ్చి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయ్యారు. రష్మిక, శ్రీలీల ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా తమ సత్తా చాటుతున్నారు.
రీసెంట్ టైమ్ లో సప్త సాగారాలు దాటి ఫ్రాంచైజ్ సినిమాలతో సక్సెస్ అందుకున్న రుక్మిణి వసంత్ కూడా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. డ్రాగన్ మూవీ షూటింగ్ కూడా పూర్తవకముందే రుక్మిణి డిమాండ్ టాలీవుడ్ లో బాగా పెరిగింది. దీంతో ఇప్పుడు శ్రీనిధి శెట్టి కూడా కన్నడ లో కెరీర్ ను స్టార్ట్ చేసి తెలుగులో స్టార్‌డమ్ అందుకున్న హీరోయిన్ల లిస్ట్ లో చేరింది.
ఇక శ్రీనిధి విషయానికొస్తే ఆమె మధ్యలో కోబ్రా అనే తమిళ సినిమా చేసింది, కానీ అది శ్రీనిధికి అనుకున్న గుర్తింపు ఇవ్వలేదు. మూడేళ్ల తర్వాత ఆమె హిట్3తో తిరిగి సిల్వర్ స్క్రీన్ పై మెరిసి మంచి హిట్ తో పాటూ భారీ గుర్తింపును కూడా అందుకుంది. హిట్3 రిలీజ్ కు ముందే ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటూ సోషల్ మీడియాలో ఎంతోమందిని ఎట్రాక్ట్ చేసిన శ్రీనిధి గురించి అందరూ డిస్కస్ చేసుకున్నారు.
హిట్3 సక్సెస్‌తో ఆల్రెడీ శ్రీనిధికి టాలీవుడ్ లో డిమాండ్ పెరిగింది. హిట్3 సక్సెస్ తో ఆమె వెంటనే స్టార్ హీరోయిన్ల లీగ్ లోకి ఎంటరయ్యే ఓ భారీ ఛాన్స్ దొరకడమే ఆలస్యం. ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ హీరోగా శ్రీనిధి శెట్టి తెలుసు కదా అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాతో పాటూ కన్నడలో సుదీప్ తో ఓ సినిమా చేస్తోంది శ్రీనిధి.